iDreamPost
android-app
ios-app

ఇండియన్ డాక్టర్స్ ఇంగ్లాండ్ గవర్నమెంట్ చూపు! ఏకంగా 2000 మందికి!

భారత్ శాస్త్ర, సాంకేతికంగానే కాకుండా.. వైద్య రంగంలో కూడా దూసుకెళుతుంది. దేశంలో లక్షలాది మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వారిని తమ దేశానికి ఆహ్వానిస్తోంది ఇంగ్లాండ్.

భారత్ శాస్త్ర, సాంకేతికంగానే కాకుండా.. వైద్య రంగంలో కూడా దూసుకెళుతుంది. దేశంలో లక్షలాది మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వారిని తమ దేశానికి ఆహ్వానిస్తోంది ఇంగ్లాండ్.

ఇండియన్ డాక్టర్స్ ఇంగ్లాండ్ గవర్నమెంట్ చూపు! ఏకంగా 2000 మందికి!

రోజులు మారాయి. భారత దేశ రూపు రేఖలు మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ విరాజిల్లుతుంది. శాస్త్ర, సాంకేతికంగానే కాకుండా వైద్య రంగంలోనూ అప్ గ్రేడ్ అవుతుంది. అందుకు ఉదాహరణ కరోనా సమయంలో.. కోవాక్సిన్ రూపొందించి, అనేక దేశాలకు సాయం అందించింది. ఇప్పటి వరకు విదేశాలకు ప్రతిభావంతులైన సాఫ్ట్ వేర్లను అందిస్తున్న భారత్ ఇప్పుడు మెరుగైన వైద్య విద్యార్థులను తయారు చేస్తుంది. అయితే ఇప్పుడు ఇలాంటి వారికి రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధమైంది ఇంగ్లాండ్ గవర్నమెంట్. ఇక్కడి వైద్యులను తమ దేశంలోకి ఆహ్వానిస్తోంది. అందుకు కారణం ఇంగ్లాండ్‌లో వైద్యుల కొరత ఏర్పడటమే.

ఏ దేశం నుండి అయితే స్వాతంత్య్రాన్ని తెచ్చుకున్నామో.. అదే దేశానికి ఇప్పుడు భారతీయుల నుండి అవసరం పడింది. ఇండియాలో మెడిసిన్ చదివిన విద్యార్థులను తమ దేశానికి రావాలంటూ ఇన్వైట్ చేస్తుంది. తక్కువ జీతాలు, ఖరీదైన ట్రైనింగ్, అధిక పని కారణంగా ఆ దేశంలో వైద్య వృత్తిని ఎంచుకోవడం లేదట. దీంతో ఆ దేశానికి వైద్యుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ హెల్త్ సర్వీస్ (NHS) ఇండియా నుండి 2 వేల మంది మెడిసిన్ చదివిన వైద్య విద్యార్తులను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన నియమించుకోనుంది. వీరికి ట్రైనింగ్ ఇచ్చి మరి తమ ఆసుపత్రుల్లో నియమించుకోనుందట. ఆరు నెలల నుండి సంవత్సర కాలం పాటు ఈ ట్రైనింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

England offers to indian doctors

భారత్‌లో ప్రతి ఏటా వేలాది మంది వైద్య విద్యార్థులు బయటకు వస్తున్నారు. సుమారు లక్ష మందికి పైగా పాస్ ఔట్ విద్యార్థులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్.. భారత్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇక్కడ వైద్యులు బ్రిటన్ వెళ్లినా.. భారత్ పై ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ఇక వీరికి ఇండియాలో నిర్వహించే ప్రొఫెషనల్ అండ్ లింగ్విస్టిక్ అసెస్ మెంట్ బోర్డు టెస్ట్ నుండి మినహాయింపు ఉంటుందని ఇంగ్లాండ్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఆ దేశానికి వాణిజ్య ఒప్పందంలో భాగంగా కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తున్న భారత్.. ఇప్పుడు వైద్యులను కూడా ఇవ్వబోతుంది. దీన్ని బట్టి చూస్తుంటే.. రోజులు మారాయి అనిపించకమానదేమో..?