iDreamPost
android-app
ios-app

అంతరిక్షం నుంచి చూస్తే హిమాలయాలు ఎలా కనిపిస్తాయో తెలుసా?

  • Published Aug 14, 2023 | 12:44 PM Updated Updated Aug 14, 2023 | 12:44 PM
  • Published Aug 14, 2023 | 12:44 PMUpdated Aug 14, 2023 | 12:44 PM
అంతరిక్షం నుంచి చూస్తే హిమాలయాలు ఎలా కనిపిస్తాయో తెలుసా?

భారతదేశానికి ఉత్తరాన.. కట్టని గోడలా.. సహజిద్ధంగా ఏర్పడ్డ హిమాలయాల సౌందర్యం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇక హిమలయాల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయి. అమర్‌నాథ్‌, మానససరోవరం, కైలాస శిఖరం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి వందలాది మంది భక్తులు తరలి వెళ్తారు. ఎన్నో జీవ నదులకు, అరుదైన ఔషధాలకు హిమాలయాలు పుట్టిల్లు. ఇక ఏటా మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా ఎందరో సాహసీకులు పర్వతారోహణం కోసం హిమాలయాలను సందర్శిస్తుంటారు. తెల్లని తెలుపులో మెరిసే పోయే మంచు కొండల అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. భూమి మీద నుంచి చూస్తేనే ఇంత అందంగా ఉన్నాయే.. అదే ఆకాశం నుంచి చూస్తే.. హిమగిరులు ఎలా కనిపిస్తాయి.. అంటే.. ఇదిగో ఈ ఫొటో చూస్తే అర్థం అవుతుంది.

అంతరిక్షం నుంచి చూస్తే హిమాలయాలు ఎలా కనిపిస్తాయో తెలియజేసే చిత్రాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు ఒక ఆస్ట్రోనాట్‌. యూఏఈకి చెందిన సుల్తాన్‌ ఏఐ నెయాది అనే ఆస్ట్రోనాట్‌.. ఈ ఫొటోలను షేర్‌ చేశాడు. అతడు గత ఆరు నెలలుగా ఇంటర్నేషన్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో అంతరిక్షం నుంచి చూస్తే హిమాలయాలు ఎలా కనిపిస్తాయో తెలిపే ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు సుల్తాన్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘‘మన గ్రహాం మీద ఉన్న అందమైన, అద్భుతమైన ప్రకృతికి ల్యాండ్‌ మార్క్‌గా నిలిచే హిమాలయాలు.. అంతరిక్షం నుంచి చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తున్నాయి’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. నెటిజనులు సుల్తాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అంతరిక్షం నుంచి ఇలాంటి ఫొటోలను పంపిన తొలి వ్యక్తి సుల్తాన్‌ మాత్రమే కాదు. గతంలో నాసా ఆస్ట్రోనాట్‌ జోష్‌ కస్సాడా.. అరోరా బొరిలియాస్‌కు సంబంధించి అంతరిక్షం నుంచి తీసిన అద్భుతమైన ఫొటోలను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.