iDreamPost
android-app
ios-app

వీడియో: ఇందుకే కదా ప్రాణాలు పోయేది.. రీల్స్ కోసం సముద్రంలోకి వెళ్లి..!

నేటికాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ అనేది ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినక్కర్లేదు. కొందరు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ రీల్స్ పిచ్చిలోనే బతుకుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు రీల్స్ పిచ్చిలో ప్రాణాలే బలితీసుకుంటున్నారు.

నేటికాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ అనేది ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినక్కర్లేదు. కొందరు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ రీల్స్ పిచ్చిలోనే బతుకుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు రీల్స్ పిచ్చిలో ప్రాణాలే బలితీసుకుంటున్నారు.

వీడియో: ఇందుకే కదా ప్రాణాలు పోయేది.. రీల్స్ కోసం సముద్రంలోకి వెళ్లి..!

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో అందరు సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. దీని ద్వారా చాలా మంది  ఫేమస్ అయ్యారు. అలానే మరికొందరు ఫేమస్ అయ్యేందు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే  వెరైటీగా రీల్స్ తీయాలనే ప్రయత్నంలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే వివిధ ప్రమాదాకరమైన ప్రాంతాల్లో రీల్స్ చేస్తూ.. చాలా మంది యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడి జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఓ యువతి పాడుబడిన బంగ్లాపై నుంచి  వీడియో చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు రీల్స్ కోసం  సముద్రంలోకి వెళ్లి.. చివరకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటికాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ అనేది ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినక్కర్లేదు. కొందరు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ రీల్స్ పిచ్చిలోనే బతుకుతున్నారు. ఈ క్రమంలోననే చాలా మంది ఈ రీల్స్ పిచ్చిలో పడిపోయి ఫోన్  కు అడిక్ట్ అవుతున్నారు. దీంతో తాము ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము అనే విషయాన్ని మార్చిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒంటి మీద సోయా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఉండటం వలనే కొన్ని సార్లు ప్రాణాలు పోయే  ఘటనలు కూడా జరుగుతున్నాయి. యువతలో రీల్స్ పిచ్చి బాగా ముదిరి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాక హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ యువతి ప్రమాదకరమైన స్టంట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

తాజాగా గుజరాత్‌లో ఇద్దరు యువకులు డేంజరస్ రీల్స్‌ చేశారు. వెరైటీగా రీల్స్ చేయాలనే పిచ్చిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఏకంగా రెండు పెద్ద వాహనాల తీసుకుని సముద్రంలోకి తీసుకెళ్లి స్టంట్ చేసేందుకు సిద్దమయ్యారు. కాకపోతే రెండు కార్లు ఇసుకలో కూరుకుపోయాయి. ఇక సముద్ర తీరం లోపలికి వెళ్లడంతో వాహనాలు ఇసుక నీటిలో కూరుకుపోయాయి. చాలా సేపు వాహనాలను బయటకు తీసేందుకు యువకులు ప్రయత్నించిన కుదరలేదు. అయితే స్థానికులు గమనించి..వారికి సాయం చేశారు. వాహనాలు వెలికి తీసేందుకు స్థానికులు సహకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పోలీసులు దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.