iDreamPost
android-app
ios-app

పోలీస్ చరిత్రలో అరుదైన ఘనత.. రెండు రాష్ట్రాలకు DGPలుగా సోదరులు!

  • Published Mar 19, 2024 | 3:16 PM Updated Updated Mar 19, 2024 | 3:16 PM

ఓ కుటుంబానికి చెందిన సోదరులు రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులయ్యారు. ఒకరూ ఇప్పటికే డీజీపీగా విధులు నిర్వర్తిస్తుండగా మరొకరు సోమవారమే వేరే రాష్ట్రానికి బాధత్యలు తీసుకున్నారు. దీంతో పోలీస్ చరిత్రలోనే అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఒకే సారి డీజీపీగా ఉండటం ఇదే ప్రథమం.

ఓ కుటుంబానికి చెందిన సోదరులు రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులయ్యారు. ఒకరూ ఇప్పటికే డీజీపీగా విధులు నిర్వర్తిస్తుండగా మరొకరు సోమవారమే వేరే రాష్ట్రానికి బాధత్యలు తీసుకున్నారు. దీంతో పోలీస్ చరిత్రలోనే అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఒకే సారి డీజీపీగా ఉండటం ఇదే ప్రథమం.

  • Published Mar 19, 2024 | 3:16 PMUpdated Mar 19, 2024 | 3:16 PM
పోలీస్ చరిత్రలో అరుదైన ఘనత.. రెండు రాష్ట్రాలకు DGPలుగా సోదరులు!

సాధారణంగా ఒకే కుటుంబంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం మనం చూస్తుంటాము. అలానే ఒకే తరహ ఉద్యోగం చేసే వారిని కూడా చూసి ఉంటాము. కానీ కొన్ని సార్లు అరుదైన ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. రాష్ట్ర స్థాయి అత్యున్నత కేడర్ లో, ముఖ్యంగా రాష్ట్ర సీఎస్, డీజీపీ వంటి పోస్టుల్లో ఒకే సారి సోదరులు ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన ఘనత కూడా ఏ సోదరులకు దక్కలేదు. కానీ ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్ రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులయ్యారు. దీంతో పోలీస్ చరిత్రలోనే అన్నదమ్ములిద్దరూ డీజీపీగా ఉండటం ఇదే ప్రథమం. మరి.. ఆ అపూర్వ సోదరలు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బిహార్ కు చెందిన వివేక్ సహాయ్, వికాస్ సహాయ్ లు అన్నదమ్ములు. వీరిద్దరు ఐపీఎస్ లుగా ఉద్యోగాలు పొందారు. మొత్తంగా ఈ సహాయ్ కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. చిన్నతనం నుంచి సమాజ సేవ చేయాలనే ఆలోచనతో ఆ దిశగా ఈ సోదరులిద్దరు అడుగులు వేశారు. ఈ క్రమంలో పోలీస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే వివేక్ సహాయ్ 1988 బ్యాచ్, వికాస్  సహాయ్ 1989 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారులుగా మారారు. వీరి సోదరుడు విక్రమ్ సహాయ్ 1992 బ్యాచ్ కి చెందిన ఐఆర్ఎస్ అధికారి. గతేడాది కాలంగా గుజరాత్ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా వికాస్ సహాయ్ ఉన్నారు. అయితే సోమవారం వివేక్​ పశ్చిమ బెంగాల్​ డీజీపీ నియయమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వూలు జారీ చేసింది. దీంతో అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా అయ్యారు. అయితే వివేక్ ఈ ఏడాదిలో పదవి విరమణ చేయనున్నారు.

Brothers as DGPs for two states

ఇక వివేక్ సహాయ్ విషయానికి వస్తే.. ఈయన పశ్చిమ బెంగాల్ కేడర్ కి చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఈ రాష్ట్రంలోనే డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ గార్డ్ గా పని చేశారు. 2021లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ భద్రత అధికారిగా ఉన్నారు. వివేక్ తన విధుల్లో విఫలమయ్యాడని ఆ ఏడాది ఆయనను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తిరిగి 2023లో డీజీగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఇటీవలే బెంగాల్ డీజీపీ ఐపీఎస్ ను తొలంగించిన కేంద్ర ఎన్నికల సంఘం వివేక్  సహాయ్ కి ఆ బాధ్యతలను అప్పగించింది.

ఇక వికాస్ సహాయ్ విషయానికొస్తే గుజరాత్ కేడర్ కి చెందిన 1989 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారి. 1989 ఐపీఎస్ గా ఎంపికైన తరువాత గుజరాత్ లోని పలు జిల్లాలకు డీఎస్పీగా పని చేశారు. అనంతరం 1999లో ఆనంద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2001లో అహ్మదాబాద్​ గ్రామీణ ఎస్పీగా పనిచేశారు. 2002లో జరిగిన గోద్రా ఘటనలో వికాస్ కూడా గాయపడ్డాడు. అలా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టుల్లో బాధ్యతలను నిర్వర్తించారు. 2007లో సూరత్‌లో అదనపు సీపీగా నియమితులయ్యారు. 2009లో ఐజీ (సెక్యూరిటీ), 2010లో సీఐడీ విభాగంలో ఐజీగా పనిచేశారు. 2023లో గుజరాత్​కు డీజీపీగా నియమితులయ్యారు.

Brothers as DGPs for two states

తన సోదరుడు వివేక్ కంటే ఒక ఏడాది ఆలస్యంగా ఐపీఎస్ కి ఎంపికైనా..  డీజీపీగా మాత్రం వికాస్ సహాయ్ ముందు బాధ్యతలు పొందారు. తాజాగా వివేక్ సహాయ్ పశ్చిమ బెంగాల్ కి  డిజీపీగా నియమితులయ్యారు. మొత్తంగా దేశలోని పోలీస్ చరిత్రలో ఇలా బ్రదర్శ డీజీపీలుగా ఉండటం తొలిసారి. మరి.. ఈ అరుదైన ఘనత సాధించిన ఈ సోదరులకు మీ అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet