iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రయాణికుడి దారుణంగా కొట్టిన టీటీఈ.. కారణం ఏంటంటే..?

  • Published Jan 18, 2024 | 7:43 PM Updated Updated Jan 18, 2024 | 7:43 PM

దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలు ప్రయాణం సురక్షితమే కాదు.. అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకే చాలా మంది ట్రైన్ ప్రయాణాలకే మక్కువ చూపిస్తుంటారు.

దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలు ప్రయాణం సురక్షితమే కాదు.. అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకే చాలా మంది ట్రైన్ ప్రయాణాలకే మక్కువ చూపిస్తుంటారు.

వీడియో: ప్రయాణికుడి దారుణంగా కొట్టిన టీటీఈ.. కారణం ఏంటంటే..?

దేశంలో చాలా మంది రైలు ప్రయాణాలు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు.  సామాన్యుల నుంచి సంపన్నుల వరకు సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా ట్రైన్ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ట్రైన్స్ లో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. ట్రైన్ లో తప్పనిసరిగా టికెట్ కొని ప్రయాణించాల్సి ఉంటుంది.. కానీ కొంతమంది టికెట్ లేకుండా ప్రయాణిస్తూ టీసీకి అడ్డంగా బుక్ అవుతుంటారు.  టికెట్ లేని వారు తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. తాజాగా ట్రైన్ లో ఓ ప్రయాణికుడిని టీటీఈ ఘోరంగా కొట్టాడు. ఈ ఘటన బరౌనీ- లక్నో ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ప్రయాణికుడిని టీటీఈ సీటులో నుంచి లేవాలని అంటున్నాడు. అంతేకాదు అతని చెంపపై పదే పదే కొడుతూ దుర్భాషలాడారు. పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు ఎందుకు కొడుతున్నారని, తప్పు చేసి ఉంటే వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నా.. టీటీఈ మాత్రం బూతులు తిడుతూ కొట్టాడు. దీన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు సెల్ ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది గమనించిన టీటీఈ వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా తిడుతూ చేయి చేసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ ప్రయాణికుడు తాను ఏ తప్పు చేయలేదని, ఎందుకు కొడుతున్నారని నిలదిస్తూనే ఉన్నాడు. టికెట్ విషయంపైనే టీటీఈ ఇలా రెచ్చిపోయి ఉంటాడని అనుకుంటున్నారు.

ట్రైన్ లో ప్రయాణికుడిపై చేయి చేసుకున్న టీటీఈ కి సంబంధించిన వీడియోని రైల్వే మంత్రి వైష్ణవ్ కి కొంతమంది నెటిజన్లు ట్వీట్ చేశారు. ఒక ప్రయాణికుడు ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.. ఫైన్ విధించాలి. ఇష్టమొచ్చినట్లు తోటి ప్రయాణికుల ముందు ఘోరంగా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో సదరు టీటీఈ ని రైల్వే శాఖ సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.