Arjun Suravaram
Truck With Train Coach: బిహార్‌లోని మోతీహరి పట్టణంలో ఉన్న ఓ వంతెన కింద రెండు రోజుల కిందట విమానం ఇరుక్కుపోయిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా అదే రాష్ట్రంలో మరో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
Truck With Train Coach: బిహార్‌లోని మోతీహరి పట్టణంలో ఉన్న ఓ వంతెన కింద రెండు రోజుల కిందట విమానం ఇరుక్కుపోయిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా అదే రాష్ట్రంలో మరో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
Arjun Suravaram
నిత్యం రోడ్డుపై అనేక ఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. విమానం, పెద్ద పెద్ద ఓడలను వాహనాల్లో తరలిచడం తరచూ జరుగుతుంటాయి. అలానే ఆ భారీ వస్తువులను చూసి.. ఆశ్చర్యానికి కూడా గురవుతుంటాము. అలానే ఈ భారీ లోడ్ తో వెళ్లే వాహనాలు తరచూ ఇబ్బందులకు గురవుతుంటాయి. వంతెనల వద్ద ఇరుక్కుపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే భారీ ట్రాఫిక్ జామ్ కావడమే కాకుండా ఇతర ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంది. ఇటీవలే ఓ వంతన కింద విమానం చిక్కుకున్న ఘటన చూశాం. తాజాగా ఓ రైలు బోగి బ్రిడ్జిపైకి ఎక్కింది. మరి.. అది ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండు రోజుల క్రితం బిహార్ రాష్ట్రంలోని మోతీహరి పట్టణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కింద విమానం ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఓ వ్యాపారి.. ఆ విమానాన్ని వేలంలో కొనుగోలు చేసి.. తీసుకెళ్తున్ను. ఈ క్రమంలోనే ఆ విమానం మోతీహరి పట్టణంలో ఓ వంతెన కింద ఇరుక్కుపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్రిడ్జీ కింద చిక్కుకుని.. అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక అక్కడే ఉండి పోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఆ విమానం గాల్లో ఎగిరేది కాదు. సర్వీస్ అయిపోయి మూలకు పడేసింది.
ఆ ఘటన మరువక ముందే బిహార్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. లక్నో నుంచి కలకత్తాకు రైలు కోచ్‌ను తీసుకెళ్తోన్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. లోహియా వంతెన వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, రైలు బోగి బ్రిడ్జీ ఎక్కిన ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ కూడా గాయపడలేదని పోలీసులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ.. రైలు బోగీని తీసుకెళ్తోన్న ట్రక్కు.. అదుపుతప్పి లోహియా వంతెన రైలింగ్‌ను ఢీకొట్టిందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై మాల్దా డివిజన్ డీఆర్ఎఫ్ వికాస్ చౌబే స్పందించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కాంప్లెక్స్-2లో ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఓ రైలుబోగిని రెస్టారెంట్ నిర్వాహకులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రక్కు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. అంతేకాక రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోయిందని అన్నారు. ఇక రైలు బ్రిడ్జి వంతెన ఎక్కిన ఘటన స్థానికులను ఆకర్షించింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే స్థానిక పోలీసులు, రైల్వే అధికారుల సహకారంతో ఎట్టకేలకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరణ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.