iDreamPost
android-app
ios-app

స్కూటీపై రూ.3 లక్షలు ఫైన్..! ఇంత మొత్తం ఎందుకు వేశారంటే?

  • Published Dec 19, 2023 | 1:27 PM Updated Updated Dec 19, 2023 | 1:27 PM

రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేశారు పోలీసులు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే చలాన్లు విధిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేశారు పోలీసులు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే చలాన్లు విధిస్తున్నారు.

స్కూటీపై  రూ.3 లక్షలు ఫైన్..! ఇంత మొత్తం ఎందుకు వేశారంటే?

ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నా.. కొంతమంది నిర్లక్ష్య కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా స్కూటీ వాహనదారుడికి లక్షల్లో ఫైన్ పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..

రోడ్డు పై వాహనాలు నడిపే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి… ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా ఆచరించాలి. వాహనదారులు, ప్రయాణికులు క్షేమంగా ఉండాలని ప్రభుత్వం, పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలు ప్రవేశపెట్టారు. కానీ కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని కంట్రోలో చేయడం కోసం చలాన్లు విధిస్తుంటారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా.. పోలీసులకు చిక్కకుండా కొంతమంది వాహనదారులు అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారికి భారీ మొత్తంలో చలాన్లు విధించడంతో షాక్ తింటారు. అలాంటి ఘటనే బెంగళూరు చోటు చేసుకుంది.

Fine of Rs 3 lakhs

బెంగుళూరు ఆర్‌టి నగర్ కి చెందిన కేఏ04KF9072 నెంబర్ పై రిజిస్ట్రేషన్ ఉన్న స్కూటీ ఫిబ్రవరి 2022 నాడు విక్రయించబడింది. సదరు స్కూటీ యజమాని కొంతకాలంగా హెల్మెట్ పెట్టుకోకపోవడం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంప్ లాంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వస్తున్నాడు. అలా 643 సార్లు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించాడు. ఇవన్నీ ట్రాఫిక్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ స్కూటీ ధర రూ. 30 వేల వరకు ఉంటుంది. కానీ వాహనదారుడు చేసిన రూల్స్ బ్రేక్ వల్ల ఏకంగా రూ.3.22 లక్షల చలాన్లు పడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలు బెంగుళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం తమ వెబ్ సైట్ లో నమోదు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరిగిన ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ట్రాఫిక్ పోలీసులు కూడా అతని చలాన్లు చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ స్కూటీ యజమానిని వెతికే పనిలో పడ్డారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.