iDreamPost
android-app
ios-app

వీడియో: దంపతులకు ట్రాఫిక్ పోలీస్‌ వార్నింగ్‌! ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి

  • Published Feb 14, 2024 | 3:35 PM Updated Updated Feb 14, 2024 | 3:35 PM

ఇక నుంచి రోడ్లపై ప్రయాణించే వావాహనాదారులకు ఆ కొత్త రూల్ అనేది అందుబాటులోకి తెచ్చారు. దీనిని తప్పకుండా పాటించాలి. ఇంతకి ఆ రూల్ ఏమిటంటే..

ఇక నుంచి రోడ్లపై ప్రయాణించే వావాహనాదారులకు ఆ కొత్త రూల్ అనేది అందుబాటులోకి తెచ్చారు. దీనిని తప్పకుండా పాటించాలి. ఇంతకి ఆ రూల్ ఏమిటంటే..

  • Published Feb 14, 2024 | 3:35 PMUpdated Feb 14, 2024 | 3:35 PM
వీడియో: దంపతులకు ట్రాఫిక్ పోలీస్‌ వార్నింగ్‌! ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి

సాధారణంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ నియమాలు అంతగా పాటించారు. దీని వలన చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. ఇటువంటి ప్రమాదాలు తీవ్రమైన గాయాలకు దారితీయడంతో పాటు మరణానికి కూడా దారి తీసే సంఘటనలు చాలా ఉన్నాయి. మరి, ఈ మధ్యకాలంలో అయితే ఈ రోడ్డు ప్రమాదాలనేవి మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకోసం ట్రాఫిక్ పోలీసులు వీటి పై ఎప్పటికప్పుడు చట్టపరంగా కొత్త నిబంధనాలు తీసుకొస్తూన్నారు. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్లిన ఇద్దరు వ్యక్తులకి హెల్మెట్ లేకపోయినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా ఇలా వివిధ రకాలుగా జరిమానాలు విధిస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా బైక్ పై వెళ్తున్నా ఇద్దరు దంపతులకు మాత్రం ఓ పోలీసు అడ్డుకొని వార్నింగ్ ఇచ్చారు. కానీ, వారిద్దరూ హెల్మెట్ ధరించడంతో పాటు నార్మల్ స్పీడ్ లో బైక్ పై ప్రయాణిస్తున్నారు. అయితే ఆ పోలీసు వార్నింగ్ ఇవ్వడానికి కారణమేమిటంటే..

చాలామంది ఒక బైక్ పై ముగ్గురు ప్రయాణిచండం గాని, హెల్మెట్ ధరించకపోవడం వంటివి చేస్తుంటే.. ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని వార్నింగ్ ఇవ్వడం, జరిమానా విధించడం జరుగుతుంది. కానీ, తాజాగా ఓ బైక్ వెళ్తున్నా దంపతులు మాత్రం వీటిలో ఏ తప్పు చేయలేదు. పైగా వారు ప్రయాణిస్తున్నా వావాహనం కూడా తక్కువ స్పీడ్ లో నడుపుతున్నారు. అయిన ఓ పోలీస్ మాత్రం వారిని అడ్డుకుని బైక్ ను రోడ్డు పక్కన నిలిపివేసి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఆ దంపతులు చేసిన తప్పుమేమిటో వివరించాడు. సిగ్నల్‌ పాయింట్‌ వద్ద వాహనదారులను చెక్‌ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. ఒక బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డుకుని వారితో ఇలా మాట్లాడుతూ.. మిత్రులారా.. మీరు పెద్ద పొరపాటు చేశారు. మీ పిల్లాది వయస్సు ఎంత.?అని అడిగారు. అందుకు ఆ దంపతులు 3 సంవత్సరాలని చెప్పారు.

దీంతో ఆ పోలీస్ అధికారి పిల్లలకు 9 నెలల నుంచి 4 సంవత్సరాల లోపు ఉంటే వారిని బైక్ ముందు కూర్చోబెట్టకూడదు. అలా కూర్చొబెట్టడం చాలా తప్పు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పాడు. అలాగే వావాహనం పై వెనుక కూర్చున్న వ్యక్తలు పిల్లలను మధ్యలో కుర్చోబెట్టుకోవాలి. లేదంటే.. సేఫ్టీ బ్యాగ్ ధరించాలని సూచించారు. ఇక నుంచి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ రూల్ ను తెలుసుకొని తప్పక పాటించాలని పోలీసులు కోరారు.

కాగా, అచ్చమైన కన్నడలో కూల్‌గా, గౌరవంగా మాట్లాడిన పోలీస్ అధికారిని ప్రస్తుతం నెటిజన్లు అభినందిస్తున్నారు. మీలాంటి ట్రాఫిక్ పోలీసులు ఉంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు పోయే ప్రమాదాలు ఉండవని.. ఓ యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే ఇలాంటి పోలీసుల వాళ్ల గౌరవం పెరిగిందని మరొకరు అన్నారు. కాగా, మరో యూజర్ స్పందిస్తూ.. మంగుళూరులో అత్యుత్తమ ట్రాఫిక్ పోలీస్ మీరే అంటూ ప్రశంసించారు. ఇక అందుకు సంబంధించిన వీడియోను మల్లికార్జున్ ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి, ఇక నుంచి పిల్లలను బైక్ ముందు కూర్చోబెట్టకూడదు అనే రూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by TRAFFIC POLICE (@mallikarjun_traffic_police112)