iDreamPost
android-app
ios-app

Ayodhya Temple:’అయోధ్య’విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత ? పూర్తి లెక్కలు

  • Published Jan 08, 2024 | 8:13 PM Updated Updated Jan 11, 2024 | 12:23 PM

దశాబ్దకాలం నుంచి ఎదురు చూస్తున్న హిందువుల చిరకాల స్వప్నం మరికొన్ని రోజుల్లో తీరబోతుంది. ఆ కొందండ రాముడు తన జన్మస్థానంలో కొలువుతీరబోయే సమయం ఆసన్నమైంది. తాజాగా ఈ అయోధ్య రామలయం కోసం ఇంతవరకూ ఎంత మొత్తంలో నిధలు సమకూరయనే ప్రశ్న చాలామంది మదిలో ఆసక్తిగా నిలిచింది. ఇక ఈ రామ మందిర నిర్మాణానికి సమకూరిన నిధులు ఎంత అంటే..

దశాబ్దకాలం నుంచి ఎదురు చూస్తున్న హిందువుల చిరకాల స్వప్నం మరికొన్ని రోజుల్లో తీరబోతుంది. ఆ కొందండ రాముడు తన జన్మస్థానంలో కొలువుతీరబోయే సమయం ఆసన్నమైంది. తాజాగా ఈ అయోధ్య రామలయం కోసం ఇంతవరకూ ఎంత మొత్తంలో నిధలు సమకూరయనే ప్రశ్న చాలామంది మదిలో ఆసక్తిగా నిలిచింది. ఇక ఈ రామ మందిర నిర్మాణానికి సమకూరిన నిధులు ఎంత అంటే..

  • Published Jan 08, 2024 | 8:13 PMUpdated Jan 11, 2024 | 12:23 PM
Ayodhya Temple:’అయోధ్య’విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత ? పూర్తి లెక్కలు

దశాబ్దకాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆ కోదండ రాముడు తన జన్మ స్థానంలో కొలువుతీరబోయే సమయం ఆసన్నమైంది. ఆ అద్భుతమైన ఘట్టం కోసం కోట్లాది మంది ప్రజలు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఎంతో కన్నుల పండుగగా జరగనున్న రామ మందిర ప్రతిష్టాపన కోసం భక్తులంతా అయోధ్య వైపే చూస్తున్నారు. ఇక ఈ రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు సమకూరిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు, భక్తులు ఈ రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు సమర్పించారు. కాగా, తాజాగా ఈ అయోధ్య రామాలయం కోసం ఇంతవరకూ ఎంత మొత్తంలో నిధులు సమకూరాయనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ రామ మందిరం కోసం ఎవరు ఎంత విరాళం ఇచ్చారో తెలుసుకుందాం.

అయోధ్య రామమందిర నిర్మాణం అనేది హిందువుల చిరకాల స్వప్నం. నూతన రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది ప్రజలు తమకు తోచిన విధంగా విరాళాలు అందించారు. అయితే ఇప్పటి వరకు ప్రజల నుంచి రూ.900 కోట్ల నిధులు సేకరించాలని రామ మందిర్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గత సంవత్సరం 2023 ఆఖరి వరకూ ఈ రామాలయ నిర్మాణానికి రూ.5 వేల కోట్లకు పైగా విరాళాలు అందాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. రామ మందిర నిర్మాణం కోసం 3200 కోట్ల విరాళాలు అందాయి. ఇప్పటి వరకు 18 కోట్ల మంది రామభక్తులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాల్లో 3,200 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఈ బ్యాంకు ఖాతాల్లో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. దానిపై వచ్చిన వడ్డీతోనే ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనులు జరిగినట్లు వెల్లడించింది.

ఇక ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారీ బాపు అత్యధిక మొత్తంలో విరాళం ఇచ్చారు. దాదాపు 11.3 కోట్ల రూపాయల విరాళం అందించారు. దీంతో పాటు యూఎస్ఏ, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ లోని అతని అనుచరులు సమిష్టిగా, విడివిడిగా 8 కోట్లు వరకు విరాళంగా ఇచ్చారు. అలాగే గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ధోలాకియా రామ మందిర నిర్మాణానికి రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. అమెరికాలో ఉన్న ఓ అజ్ఞాత భక్తుడు కూడా ఆలయ ట్రస్టుకు విరాళంగా రూ.11,000 పంపారు. కాగా, అయోధ్యకు చెందిన రామ మందిర నిర్మాణానికి తొలి విదేశీ విరాళం కూడా ఇదే.

గతంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021, జనవరి 14న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక దేశంలో అయోధ్య ఆలయ నిర్మాణానికి రూ. 5 లక్షలు చెక్కు రూపంలో విరాళం ఇచ్చిన తొలి వ్యక్తి కూడా రామ్‌నాథ్ కోవిందే అవ్వడం విశేషం. మరి, అయోధ్య రామాలయ నిర్మాణానికి అందిన విరాళాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.