రేపు భారత్ బంద్! బస్సులు, రైళ్లు తిరుగుతాయా?

Bharat Bandh: రేపు భారత్ బంద్ జరగనున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్ల విషయంలో జనాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపు జరగనున్న బంద్ కారణంగా బస్సులు, రైళ్లు తిరుగుతాయా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం..

Bharat Bandh: రేపు భారత్ బంద్ జరగనున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్ల విషయంలో జనాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపు జరగనున్న బంద్ కారణంగా బస్సులు, రైళ్లు తిరుగుతాయా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్ బంద్.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివిధ సందర్భాల్లో పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు భారత్ బంద్ కు పిలుపునిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని బంద్ ల సమయంలో బస్సులు, రైళ్లు రద్దు అవుతుంటాయి. అలానే రేపు కూడా భారత్ బంద్ జరగనుంది. ఆగష్టు 21 బుధవారం దేశ వ్యాప్తంగా బంద్ జరగనుంది. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లు తిరుగుతాయా? లేదా అనే సందేహం అందరిలో ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావ్ సంఘర్ష్ సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు రాజస్థాన్ లోని ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు చూస్తున్నారు. రేపు జరగనున్న బంద్‌ ను పరిశీలించేందుకు సీనియర్‌ సివిల్‌, పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారు. డివిజనల్ కమిషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్లు, పోలీసు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై కీలక విషయాలను చర్చించారు.

2024 ఆగస్ట్ 21వ తేదీన బస్సులు, రైళ్లు తిరుగుతాయా, స్కూల్స్ ఉంటాయా లేక సెలవు ప్రకటిస్తారా అనే విషయంపై ప్రస్తుతానికి మాత్రం క్లారిటీ రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి  ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ఆర్టీసీ, రైల్వే శాఖల నుంచి భారత్ బంద్ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కాబట్టి రైళ్లు, బస్సులు తిరుగుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే నేడు సాయంత్రం వరకు టైమ్ ఉంది కాబట్టి  వేచి చూడాలి. అలానే వివిధ శాఖల్లోని యూనియన్స్, సంఘాలు సైతం భారత్ బంద్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక విద్యాసంస్థల విషయంలోనూ విద్యా శాఖ, ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పటి వరకు ఎలాంటి సెలవు ప్రకటించలేదు. కాబట్టి వీటిపై స్పష్టత రావాలంటే భారత్ బంద్ అయిన బుధవారం ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక బ్యాంకులు కూడా బంద్ ఉంటాయని, వాటి సంఘాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం బుధవారం భారత్ బంద్ అనేది మాత్రమే ఇప్పటి వరకు తెలిసింది. రేపు బంద్ లో ఏం ఉంటాయి.. ఏం మూసివేస్తారు. వ్యాపార సంస్థలు నడుస్తాయా లేదా అనేది కూడా స్పష్టలేదు. వాటిపై స్పష్టత రావాలంటే రేపటి వరకు ఎదురు చూడాలి. అయితే ఈ భారత్ బంద్‌కు వివిధ సామాజిక, రాజకీయ సంస్థల మద్దతు లభిస్తుందని భారత్ బంధ్ నిర్వహిస్తున్న సంఘాలు భావిస్తున్నాయి.

Show comments