Keerthi
మార్కెట్ లో టమాటా ధర మళ్లీ పెరిగిపోయింది. దీంతో సామాన్య ప్రజలు టమాటాల ధరలను చూసి వాపోతున్నారు. ప్రస్తుతం వారం క్రితం విక్రయించిన టమాటా ధర ఇప్పుడు డబుల్ రెట్టింపు అయ్యింది. ఇంతకి ఎక్కడంటే..
మార్కెట్ లో టమాటా ధర మళ్లీ పెరిగిపోయింది. దీంతో సామాన్య ప్రజలు టమాటాల ధరలను చూసి వాపోతున్నారు. ప్రస్తుతం వారం క్రితం విక్రయించిన టమాటా ధర ఇప్పుడు డబుల్ రెట్టింపు అయ్యింది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన కూరగాయాలు ఏదైనా ఉంది అంటే అది టమాటా అనే చెప్పావచ్చు. ఎందుకంటే.. ఇటీవలే కొంచెం తగ్గినట్లు తగ్గి మళ్లీ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ టమాటాలు ఇలా అధికంగా పెరగడానికి కారణం.. పంటను సాగు చేయడానకి కావలసిన నీరు లేకపోవడమే అంటున్నారు రైతులు. అసలు సరైనా సమయంలో వర్షలు పడకపోవడం, పంట చేతికి వచ్చే సమయంలో.. ఆకాల వర్షాలతో ఇలా పంట దిగుబడి చేతికందటం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఇలా మర్కెట్ లో మరోసారి టమాటా ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు వాటిని కొనాలన్నా, వినియోగించాలన్న భయపడుతున్నారు. అయితే తాజాగా రాష్ట్రంలో వారం క్రితం విక్రయించిన టమాటా ధర ఇప్పుడు డబుల్ రెట్టింపు అయ్యింది. ఇంతకి ఎక్కడంటే..
మార్కెట్ లో టమాటా ధర మళ్లీ పెరిగిపోయింది. దీంతో సామాన్య ప్రజలు టమాటాల ధరలను చూసి వాపోతున్నారు. కాగా, ఇలా ధరలు పెరగడానికి కారణం.. పంట సాగును కొనసాగించడానికి నీరు లేకపోవడమే తక్కువ దిగుబడి వస్తుందని రైతన్నలు చెబుతున్నారు. అయితే వారం క్రితం కిలో రూ.9 నుంచి రూ.10కి విక్రయించిన ధరలు ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే ఈ ధరలు అనేవి తమిళనాడులో పెరుగుతున్నాయి. ఎందుకంటే.. తమిళనాడు ధర్మపురిలో ఏటా 6 వేల హెక్టార్లలో టమోటా సాగు చేస్తున్నారు. పైగా అక్కడ ఎక్కువగా చిన్న తరహా రైతులు స్థిరమైన ఆదాయ వనరుగా భావించి పంటను పండిస్తారు. కానీ, సరైనా సరఫరా లేకపోవడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యవసాయ మార్కెటింగ్, అగ్రి బిజినెస్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నీరు లేకపోవడంతో సాగును కొనసాగించలేకపోతున్నామని కొందరు రైతులు వాపోతున్నారు.
ఇక పాలకోడ్ కు చెందిన ఆర్. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. పాలకోడ్ పరిసర ప్రాంతాల్లో టమోటాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాగా, వీటిని సాగు చేయాడానికి చాలా సులభం, తక్కువ నీరు అవసరం అవుతుంది. అలాగే ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి బాగుంది. కాబట్టి, దీనిని తరచుగా చిన్న రైతులు ఎంచుకుంటారు. కానీ, ఇటీవలే నీటి వనరులు లేకపోవడంతో.. సాగు విస్తీర్ణం తగ్గింది. చాలా మంది వేసవిలో ఇతర ఉపాధి కోసం ముందు జాగ్రత్త చర్యగా ఉత్పత్తిని కూడా నిలిపివేశారు. కాబట్టి, సరఫరా తగ్గడానికి ఇదే కారణం కావచ్చు అని ఆయన అన్నారు.కాగా, గత కొన్ని నెలలుగా ధరలు అనేవి సంతృప్తిగా లేవని, ఇది కూడా ఉత్పత్తి తగ్గడానికి కారణమని ఆయన తెలిపారు.
కాగా, ప్రస్తుతం పాలకోడ్ టమాటా మార్కెట్లో.. 8 టన్నులకు పైగా వస్తున్నాయి. సాధారణంగా ఈ నెలలో 20 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. అలాగే పీక్ సీజన్లో 700 నుంచి 800 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ, ఇప్పుడు 20 టన్నులు మాత్రమే వస్తున్నాయి. టమాటా సరఫరా తక్కువగా ఉన్నప్పటికీ ధరలు అంత ఎక్కువగా లేవు. పైగా మార్కెట్ లో 35 కిలోల బాక్సు రూ.250 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని ఆయన అన్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ టమాటా ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి, తమిళనాడులో టమాటా ధర ఒక్కసారిగా పెరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.