iDreamPost
android-app
ios-app

తిండి, నీళ్లు లేకుండా తల్లి శవంతో 4 రోజులు గడిపిన కూతురు.. చివరికి..

  • Published May 19, 2024 | 5:25 PM Updated Updated May 19, 2024 | 5:25 PM

Karnataka Crime News: జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే.. ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఓ సంఘటన ఉడిపి జిల్లా కుందాపూర్ లో జరిగింది. తల్లీ కూతురు మరణం తీవ్ర కలకలం రేపింది.

Karnataka Crime News: జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే.. ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఓ సంఘటన ఉడిపి జిల్లా కుందాపూర్ లో జరిగింది. తల్లీ కూతురు మరణం తీవ్ర కలకలం రేపింది.

తిండి, నీళ్లు లేకుండా తల్లి శవంతో 4 రోజులు గడిపిన కూతురు.. చివరికి..

భూమిపై దేవుడు తనకు బదులుగా తల్లిని పంపించారని అంటారు పెద్దలు. నవ మాసాలు కడుపులో బిడ్డను మోసే తల్లి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డను చూసి ఆ కష్టాలన్నీ మర్చిపోతుంది. తన బిడ్డకు ఏ చిన్ని ఇబ్బంది కలిగినా విల విలలాడిపోతుంది. తనకు కష్టమొస్తే తన కష్టంగా భావిస్తుంది. తన పిల్లలు అనారోగ్యం, మందబుద్దితో ఉన్నా కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటుంది. తాను చనిపోయే వరకు కన్న బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. అందుకే తల్లిని మించిన దైవమున్నాదా అని అంటారు. ఉడిపి జిల్లా దాసనాహడి గ్రామంలో తల్లీ కూతురు కి సంబంధించిన ఓ ఘటన తీవ్ర కలకం రేపింది. ఇంతకీ ఆ తల్లీ కూతురుకి ఏమైంది? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకా దాసనాహడి గ్రామంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది.. ఆ విషయం తెలియక ఆమె కూతురు తల్లి శవంతో నాలుగు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా అక్కడే ఉంది.. చివరికి కన్నుమూసింది. ఈ సంఘటన అందరి హృదయాలను కదిలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసన్‌హడి గ్రామానికి చెందిన జయంతి శెట్టి (62), ప్రగతి శెట్టి (32) తల్లీ కూతురు కొంతకాలంగా నివసిస్తున్నారు. తల్లి జయంతి శెట్టికి కొంత కాలంగా డయాబెటీస్, హై బీపీతో బాధపడుతున్నారు. ఇక ప్రగతి శెట్టి కి చిన్పటి నుంచి బుద్ధిమాంద్యం. అందుకే తల్లి కూతురుని కంటికి రెప్పలా సాకుతుంది.

నాలుగు రోజుల క్రితం జయంతి శెట్టి ఆరోగ్యం క్షీణించి కన్నుమూసింది. తన తల్లి చనిపోయింది అన్న విషయం కూతురు ప్రగతి శెట్టికి తెలియక తల్లీతోనే ఉంది. అమ్మా లే.. అమ్మా లే.. అంటూ పిలుస్తూ అలాగే తిండి, నీళ్లు లేకుండా తల్లి శవంతో నాలుగు రోజులు గడిపింది. నాలుగు రోజులుగా ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడం.. ఇంట్లో నుంచి దుర్గందం రావడంతో ఆదివారం (మే 19) చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా ఒక్కసారే షాక్ కి గురయ్యారు. జయంతి శెట్టి చనిపోయి ఉంది.. పక్కనే ప్రగతి శెట్టి శరీరం క్షీణించి పోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జయంతి శెట్టి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. ప్రగతి శెట్టిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రగతి శెట్టి కూడా కన్నుమూసింది. అనంతరం ఆమె పోస్ట్ మార్టం పూర్తి చేసి తల్లీకూతుళ్ల అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా అందరి హృదయాలు కలచి వేసింది.