iDreamPost
android-app
ios-app

వీడియో: మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళను వేధించిన ఆకతాయి..!

  • Published Aug 05, 2024 | 5:31 PM Updated Updated Aug 05, 2024 | 5:31 PM

ప్రస్తుత సమాజంలో మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్నింగ్ వాకింగ్ కి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఈఘటన మార్నింగ్ వాకింగ్ కి వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తోంది.

ప్రస్తుత సమాజంలో మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్నింగ్ వాకింగ్ కి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఈఘటన మార్నింగ్ వాకింగ్ కి వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తోంది.

  • Published Aug 05, 2024 | 5:31 PMUpdated Aug 05, 2024 | 5:31 PM
వీడియో: మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళను వేధించిన ఆకతాయి..!

నేటికాలంలో  మనిషి రూపంలో ఉన్న మృగాలు ఎక్కువయ్యారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు..తమలోని పశువును నిద్రలేపుతుంటారు. ఇలాంటి కామాంధుల కారణంగా ఎంతో మంది మహిళలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ మహిళ మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో ఊహించని ఘటన ఎదుర్కొంది. బాధితురాలు వాకింగ్ చేస్తుండగా సడెన్ గా ఓ వ్యక్తి వచ్చి ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కొనన్ కుంటే ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఓ మహిళ ఒంటరిగా వాకింగ్ చేస్తోంది. ఇదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమె తనలాగా వాకింగ్ చేసే వారని పట్టించుకోలేదు. అయితే ఆమెకు దగ్గరగా వచ్చి..వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు.  ఆతరువాత ఆమెను అసభ్యంగా తాకుతూ లైంగిక దాడి చేశాడు. ఇక ఈ ఊహించని పరిణామంతో సదరు మహిళ షాకి గురైంది. వెంటనే తేరుకుని గట్టిగా ప్రతిఘటించింది. ఆ వ్యక్తి నుంచి తనను తాను విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. గట్టిగా కేకలు వేసినా ఆ వ్యక్తి..మహిళను వదల్లేదు.

చివరికి ఆమె వాడి నుంచి తప్పించుకుని కాస్తా ముందుకు వెళ్లింది. అయినా ఆ ఆకతాయి.. ఆమెను వదలకుండా నోరు మూసే ప్రయత్నం చేశాడు. దాంతో ఆమె మరోసారి గట్టిగా కేకలు పెట్టింది. భయపడ్డ దుండగుడు ఆ మహిళను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే బాధితురాలు రాజస్థాన్ కి చెందిన మహిళాగా తెలుస్తోంది. ఈ ఘటనపై దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. జన సంచారం ఎక్కువగా లేని ప్రాంతాల్లోకి మహిళలు ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిదని పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş