iDreamPost
android-app
ios-app

పెళ్లయిన 4 రోజులకే.. ఎవరు ఊహించని పని చేసింది!

  • Published Feb 16, 2024 | 7:05 PM Updated Updated Feb 16, 2024 | 7:05 PM

ఇష్టంలేని పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లయిన నాలుగు రోజులకే ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలేం జరిగిదంటే..

ఇష్టంలేని పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లయిన నాలుగు రోజులకే ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలేం జరిగిదంటే..

  • Published Feb 16, 2024 | 7:05 PMUpdated Feb 16, 2024 | 7:05 PM
పెళ్లయిన 4 రోజులకే.. ఎవరు ఊహించని పని చేసింది!

ఈ మధ్యకాలంలో యువత ప్రతి చిన్న సమస్యని భూతద్దంలా చూస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని అధిగమించే శక్తి లేక.. లేనిపోని ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చాలామంది పిచ్చి ప్రయత్నాలు చేస్తూ తల్లిదండ్రులకు శుకసంధ్రంలో పడేస్తున్నారు. అయితే ప్రతిఒక్క సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. ఈ వాస్తవాన్ని గ్రహించక ఎంతోమంది నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఒకవేళ తమకు ఇష్టం లేని మార్గల్లో ప్రయాణం చేయలేని వారు.. ధైర్యంగా సమస్య నుంచి బయటపడాలే కానీ, ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సమస్యలు తీరిపోవు. అది కెరీర్ విషయంలోనైనా, జీవిత భాగస్వామ్య విషయంలోనైనా సందేహ పడకుండా నిర్ణయాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. అలా తెలియజేయలేక మనసు ని చంపుకొని ఓ నవ వధువు చేసిన పనికి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అసలేం జరిగిదంటే..

ఎవరికైనా ఇష్టం లేని పని చేయాలంటేనే మనసుకు కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం ఆ భారన్ని గుండెల పై మోయాలంటే నరకంలా ఉంటుంది. తాజాగా దిండుగల్ జిల్లాకు చెందిన ఓ యువతికి కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకొని.. కష్టాంలా భావించిదో ఏమో కానీ, ఏకంగా.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిండిగల్ జిల్లా నోచియోడైపట్టి గ్రామనికి చెందిన మురుగేశన్ కు ప్రియ అనే 19 ఏళ్ల కూతురు ఉంది. కాగా, ఈమె ఇదే గ్రామంలోని ఓ కాలేజీలో చదువును కొనసాగిస్తుంది. అయితే ఉన్నట్టుండి మురుగేశన్ తన కూతురికి పెళ్లి చేయలేని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తేని జిల్లాలోని కూడలూరు ప్రాంతంలో కమలకన్నన్ అనే వ్యక్తితో పెళ్లమురుగేశన్ తన కూతురికి వివాహం నిశ్చయించాడు. కాగా, కమలకన్నన్ కంబాలోని ఓ ఆర్క్ షాప్ నడుపుతున్నాడు. అయితే వీరిద్దరికి ఈనెల 11న వివాహం జరగింది. కానీ, ప్రియకు మొదటి నుంచి ఈ పెళ్లాంటే ఇష్టం లేదు. కేవలం తన తల్లిదండ్రుల బలవంతం పై ఆమె ఈ పెళ్లి చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

ఇక వివాహానంతరం వరుడి ఇంటికి చేరిన నూతన వధూవరులు మంగళవారం డిండికి చేరారు. కాగా, ఆ రోజు రాత్రి దంపతులిద్దరూ.. విడివిడిగా నిద్రించారు. అయితే మరుసటి రోజు ఉదయం అనగా బుధవారం నాడు ప్రియ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఉదయం లేచి చూసిన కమలకన్నన్‌.. తన భార్య ఉరివేసుకుని ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలియజేశాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు.. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, ఈ ఘటన పై విచారణ కొనసాగుతోంది. అయితే పెళ్లియిన 4 రోజులకే నూతన వధువు ఇలా ఆత్మహత్య చేసుకోవడం పై ఆర్టీఓ విచారణకు ఆదేశించారు. మరి, ఇష్టం లేని పెళ్లి చేసుకొని నూతన వధువు ఇలా తనువు చలించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/