iDreamPost
android-app
ios-app

ఆడపిల్లల కోసం కొడుకుని చంపేసిన తండ్రి! భారతీయుడు రేంజ్ స్టోరీ!

  • Published Feb 02, 2024 | 2:40 PM Updated Updated Feb 03, 2024 | 7:20 PM

స్కూల్ కి వెళ్లి చదువుకోవాలిసిన ఓ బాలుడు అమ్మాయిల పాట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఫోన్ లో అశ్లీల వీడియోలను చూసి వింతగా ప్రవర్తించడం చేస్తున్నాడు. దీంతో కుమారుడి తీరు పై విసిగు చెందిన తండ్రి ఏం చేశాడంటే..

స్కూల్ కి వెళ్లి చదువుకోవాలిసిన ఓ బాలుడు అమ్మాయిల పాట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఫోన్ లో అశ్లీల వీడియోలను చూసి వింతగా ప్రవర్తించడం చేస్తున్నాడు. దీంతో కుమారుడి తీరు పై విసిగు చెందిన తండ్రి ఏం చేశాడంటే..

  • Published Feb 02, 2024 | 2:40 PMUpdated Feb 03, 2024 | 7:20 PM
ఆడపిల్లల కోసం కొడుకుని చంపేసిన తండ్రి! భారతీయుడు రేంజ్ స్టోరీ!

ఇటీవల కాలంలో యువత చదువుకోవాల్సిన వయసు నుంచే పెడదోవ పడుతున్నారు. లేని పోని వ్యసనాలకు బానిస అవుతున్నారు. అందులో స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో.. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దీంతో అనేక చిల్లర వేషాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అమ్మాయిలను ఏడిపించడం వంటి చేష్టలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులు చేస్తున్న పిల్లలకు.. వారి తల్లిదండ్రులు మందలించడం, సమర్దించడం, చూసి చూడటనట్టు వదిలేయడం చేస్తుంటారు. కానీ, మహారాష్ట్రలోని ఓ బాలుడు ఇలానే చెడుదారిలో వెళ్తుంటే ఆ తండ్రి చేసిన పనికి స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

భారతీయుడు సినిమాలో లంచం కోసం కన్న కొడుకునే చంపేసినట్టు.. సమాజం కోసం ఓ తండ్రి సొంత కొడుకునే హత్య చేశాడు. వినడానికి సినిమా స్టోరిలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్రలోని చోటు చేసుకుంది. స్కూల్ కు వెళ్లి బుద్దిగా చదువుకోవాల్సిన వయసులో ఓ బాలుడు చెడుదారుల్లో వెళ్తున్నాడు. ఆ స్కూల్ లో ఉన్న అమ్మాయిలను ఏడిపిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో పాటు మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆ బాలుడి తీరును చూసి విసిగిపోయిన తండ్రి ఆ బాలుడిని విషమిచ్చి హతమర్చాడు. పోలీసులు కథనం ప్రకారం.. సోలాపూర్ జిల్లాకు  చెందిన విజయ్ బట్టు అనే వ్యక్తి దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి విశాల్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆ బాలుడు కనిపించడం లేదంటూ జనవరి 13న పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆ బాలుడి కోసం గాలించగా.. ఓ నిర్మాన్యుషమైన ప్రాంతంలో ఆ బాలుడి మృతదేహం లభ్యమైంది. దానిని తప్పిపోయిన తమ కుమారుడు విశాల్ మృతదేహంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆనంతరం పోస్ట్ మార్టం నిర్వహించగా.. విషం తాగి మరణించినట్లు తేలింది. దీంతో ఇది హత్యకు సంబంధించిన కేసుగా నిర్ధారించిన పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. కాగా, వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులకు అనుమానం బలపడింది. ఈ నేపథ్యంలోనే ఆ బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. తన కొడుకు విశాల్ ని తానే చంపినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

అయితే కుమారుడు చదువుకోకుండా పెడదోవ పడుతున్నాడని, తన ప్రవర్తనతో విసిగిపోయి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. ఆ బాలుడు స్కూల్ లో అమ్మాయిల్ని టీజ్ చేయడం, మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలను చూడటం వంటివి చేస్తున్నాడని, ఎంత మందలించిన తీరు మారలేదని విచారణలో వెల్లడించాడు. అంతేకాకుండా స్కూల్ నుంచి తనకు తరుచూ ఫిర్యాదులు రావడంతో విసిగిపోయానని చెప్పాడు. ఈ క్రమంలోనే.. తన కొడుకును జనవరి 13న ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తుల్జాపూర్ రోడ్డుకు తీసుకెళ్లి.. అక్కడ కూల్ డ్రింక్ కొనుగోలు చేసి విషం కలిపి ఇచ్చినట్టు అంగీకరించాడు. అది తాగిన తర్వాత స్పృహ‌త‌ప్పి పడిపోవడంతో అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేశానని పేర్కొన్నాడు.అదే రోజు సాయంత్రం ఏమీ తెలియనట్టు తన భార్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. తమ కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మరి, కుమారుడు ప్రవర్తనతో విసిగిపోయి హత్య చేసిన ఆ తండ్రి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş