Arjun Suravaram
ప్రేమించడం చాలా సులభం.. కానీ ఆ ప్రేమను గెలిపించుకోవడం చాాలా కష్టం. అంతేకాక గెలిపించుకున్న ప్రేమను జీవితాంతం నిలబెడ్డుకోవడం ఇంకా కష్టం. ఇందులో చాలా ఎక్కువ మంది విఫలం అవుతుంటారు. అలానే ఓ జంట కూడా విఫలమైంది.
ప్రేమించడం చాలా సులభం.. కానీ ఆ ప్రేమను గెలిపించుకోవడం చాాలా కష్టం. అంతేకాక గెలిపించుకున్న ప్రేమను జీవితాంతం నిలబెడ్డుకోవడం ఇంకా కష్టం. ఇందులో చాలా ఎక్కువ మంది విఫలం అవుతుంటారు. అలానే ఓ జంట కూడా విఫలమైంది.
Arjun Suravaram
ప్రేమ అనేది చూడటానికి, పలకడానికి చాలా సింపుల్ పదమే. కానీ..దాని ద్వారా జరిగే పరిణామాలు మాత్రం చరిత్రలో నిలిపోయేలా ఉంటాయి. అంతేకాక ఈ ప్రేమ కారణంగా ఎన్నో సమస్యలు, అవరోధాలు ఎదురవుతుంటాయి. ప్రేమలో ఉండటం చాలా ఈజీ..కానీ ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం చాలా కష్టం. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కుటుంబ పెద్దలు ఒప్పుకోకపోవడం, ప్రేమికులే పరస్పరం ఆరోపణలతో విడిపోవడం వంటివి జరిగి ప్రేమలు విఫలవుతుంటారు. కానీ అలాంటి ఎన్నో అవరోధాలను దాటి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. అలా నాలుగేళ్లుగా ప్రేమించుకుని ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట కథలో విషాదం జరిగింది. పెళ్లైన మూడు రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమించడం చాలా ఈజీ, దానిని గెలవడం కష్టమనే విషయం అందరికీ తెలుసు. అలానే నేటికాలంలో ప్రేమలు ఎలా ఉన్నాయంటే.. మార్నింగ్ షోకి ఒకరు, మ్యాట్నీ షోకి మరోకు, ఫస్ట్ షోకి మరోకరితో సినిమాకు వచ్చినట్లే ఉన్నాయి. అయితే కొన్ని ప్రేమలు మాత్రం చాలా నిజాయితీగా ఉంటాయి. ఎంతలా అంటే.. ఏళ్ల తరబడి ప్రేమించుకుంటునే ఉంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చివరకు తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి విజయం సాధిస్తుంటారు.
అలానే ఓ జంట కూడా తమ నాలుగేళ్ల ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లింది. అయితే మూడు రోజులకే విషాదం మిగిలింది. కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు తాలూకాలో తేగూరు గ్రామానికీ చెందిన నేషనల్ కబడ్డీ ప్లేయర్ వినోద్ రాజ్ (24) తన తల్లిదండ్రులకు ఒకే కుమారుడు. అతడిపైనే వారి కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. బాగా చదువుకుని, అలానే కబడ్డీలో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాందిస్తాడని వారు కలలు కన్నారు. అయితే అతడు కూడా తన తల్లిదండ్రుల ఆశలను నిజం చేసే దిశగానే అడుగులు వేశాడు. ఇలా సాగుతున్న అతడి హృదయంలోకి ప్రేమ గాలి వచ్చి చేరింది.
వినోద్ రాజ్ నాలుగేళ్లుగా ఆదే గ్రామానికి చెందిన తనుజా అనే యువతిని ప్రేమించాడు. వారి ప్రేమకు ఇరుకుటుంబాల్లో అంగీకరించలేదు. అయితే పెద్దల అంగీకారం కోసం చాలా కాలం ఆగారు. అయినా కూడా వారిని సానుకూల స్పందన రాలేదు. దీంతో 2023 డిసెంబర్ 10న ఇంటి నుంచి వినోద్ పారిపోయి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అంతేకాక తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే వధూవరులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టి తిరిగి పంపిం చేశారు. అనంతరం మూడు రోజులకే తనుజా తాళిని వినోద్‌రాజ్‌కు ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్లుగా ప్రేమించిన యువతి పెళ్లైన నాలుగు రోజులకే వెళ్లిపోవడంతో వినోద్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
తాను ప్రేమించిన అమ్మాయి లేకపోవడంతో ఒంటరిగా ఫీలయ్యాడు. ఇక భార్య తనను వదిలి వెళ్లిందనే మనస్తాపంతో అతను ఈ నెల 2న ఉరి వేసుకున్నాడు. వినోద్ ను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మంగళూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వినోజ్ రాజ్ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లైన నాలుగు రోజులకే విషాదంగా మారడం అందరిని కన్నీరు పెట్టించింది. అలానే ఎంతో భవిష్యత్ ఉన్న ఆ యువకుడు.. క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. మరి.. ఇలాంటి ప్రేమ మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.