iDreamPost
android-app
ios-app

బాయ్‌ఫ్రెండ్ ని ఇంటికి పిలిచి ఉప్పెన సీన్ రిపీట్ చేసిన లేడీ డాక్టర్!

  • Published Jul 02, 2024 | 7:15 PM Updated Updated Jul 02, 2024 | 7:15 PM

గత ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన తన ప్రియుడి పట్ల ఓ యువతి అతి కిరాతికంగా వ్యవహరించింది. పెళ్లికి నిరాకరించడని కోపం పెంచుకున్న యువతి అతడిని ఇంటికి పిలిచి దారుణంగా ఆ పని చేసింది.

గత ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన తన ప్రియుడి పట్ల ఓ యువతి అతి కిరాతికంగా వ్యవహరించింది. పెళ్లికి నిరాకరించడని కోపం పెంచుకున్న యువతి అతడిని ఇంటికి పిలిచి దారుణంగా ఆ పని చేసింది.

  • Published Jul 02, 2024 | 7:15 PMUpdated Jul 02, 2024 | 7:15 PM
బాయ్‌ఫ్రెండ్ ని  ఇంటికి పిలిచి ఉప్పెన సీన్ రిపీట్ చేసిన లేడీ డాక్టర్!

ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో కొందరు ప్రేమికులు ఉన్మాదులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో వారు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలన ఊహించని ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వారి జీవితం నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబంలో తీవ్ర విషాదంను నింపుతున్నారు. అయితే ఈ మధ్య ప్రేమించుకోవడం, నచ్చినంత కాలం కలసి తిరగడం ఫ్యాషన్ అయిపోయింది. తీరా ఇష్టం పోయకా ఏదో ఒక కారణంతో విడిపోవడం, ఇంట్లో వాళ్లు వద్దన్నారని, వేరే సంబంధాలు చూస్తున్నారని ఇలా రకరకాల కారణాలతో తమని ప్రేమించి వాళ్లని మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నారు.  దీంతో ప్రాణంగా ప్రేమించిన వారు దూరం అవుతున్నారనే నేపథ్యంలో.. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, ప్రేమించిన వాళ్లని హత్య చేయడం వంటి ఘటనలు తరుచుగా వింటు ఉన్నాం. అయితే  ఇప్పటి వరకు ఇలాంటి ఘటనల్లో అమ్మాయిలపై హత్యలు, దాడులు జరగడం చూసి ఉంటాం. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ప్రేమించి పెళ్లికి నిరాకరించడనే  కారణంతో.. అబ్బాయిపైనే  ఓ అమ్మాయి దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన తన ప్రియుడి పట్ల ఓ యువతి అతి కిరాతికంగా వ్యవహరించింది. పెళ్లికి నిరాకరించడనే కోపంతో ఇంటికి పిలిచి అతని పురుషాంగాన్ని కట్ చేసింది. అయితే ఈ దాడికి పాల్పడిన యువతి ఓ వైద్యురాలు కావడం గమన్హారం. అయితే ఈ కిరాతకమైన ఘటన .బిహార్ లోని సరన్ జిల్లా మ‌ధురా బ్లాక్‌లోని చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. బిహార్ లోని సరన్ జిల్లా మ‌ధురా బ్లాక్‌లోని వార్డు నెంబ‌ర్ 12 కౌన్సిల‌ర్‌, ఓ మహిళా డాక్టర్ గత ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. దీంతో ఆ తన ప్రియుడుకి ఈ లేడీ డాక్టరు పదే పదే పెళ్లి చేసుకోమని కోరుతుంది. అయితే ప్రియుడు మాత్రం పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అయిన సరే ఆమె రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెళ్లి కోసం ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కింది. అయినా సరే అతడిలో ఏ మాత్రం మార్పు రాలేదు.

దీంతో ప్రియుడు పై కోపం పెంచుకున్న లేడీ డాక్టర్..  త‌న ఇంటికి అత‌న్ని పిలిచింది. ఇక ఇంటికి వ‌చ్చిన ఆ కౌన్సిల‌ర్   పురుషాంగాన్ని ఆమె క‌ట్ చేసింది. దీంతో కౌన్సిల‌ర్ అరుపులు విన్న స్థానికులు.. వెంటనే ఈ ఘటన  గురించి పోలీసుల‌కు తెలిపారు. అంతేకాకుండా.. బాధితుడిని  వెంట‌నే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘోరానికి పాల్పడిన నిందుతురాలు హజిపూర్ గా గుర్తించారు. అయితే ఆమె  మ‌ధౌరాలో డాక్టర్  ప్రాక్టీసు చేస్తోంది. అలాగే బాధిత వ్యక్తి కూడా పెళ్లి కాని యువకుడిగా మ‌ధౌరా పోలీసు స్టేష‌న్ అధికారి తెలిపారు. ఇక  నిందితురాల‌ని హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేశామ‌ని, త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. మరి, పెళ్లికి నిరాకరించడనే కోపంతో ప్రియుడి పురుషాంగాన్ని కట్ చేసిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet