iDreamPost
android-app
ios-app

చూడముచ్చటైన జంట.. విధి ఆడిన వింత నాటకంలో.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Sep 12, 2024 | 8:28 AM Updated Updated Sep 12, 2024 | 11:16 AM

Wayanad Floods: ఇటీవలే వాయనాడ్ లో భారీ వరదలు ముంచెత్తిన క్రమంలో చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి తన  తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయింది. అయితే అందర్నీ కోల్పోయిన శ్రుతి జీవితంలో మరో పిడుగులాంటి విషాదం చోటు చేసుకుంది.

Wayanad Floods: ఇటీవలే వాయనాడ్ లో భారీ వరదలు ముంచెత్తిన క్రమంలో చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి తన  తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయింది. అయితే అందర్నీ కోల్పోయిన శ్రుతి జీవితంలో మరో పిడుగులాంటి విషాదం చోటు చేసుకుంది.

  • Published Sep 12, 2024 | 8:28 AMUpdated Sep 12, 2024 | 11:16 AM
చూడముచ్చటైన జంట.. విధి ఆడిన వింత నాటకంలో.. అసలు ఏం జరిగిందంటే?

ఏ మనిషికైనా జీవితంలో ఏదొక తోడు అనేది కచ్చితంగా ఉండాలి. అది తల్లి, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, భర్త ఇలా ఎవరైనా సరే.. మనకంటూ చెప్పుకోవడానికి ఒకరైనా ఉండాలి. కానీ, ఎవరు మనకంటూ లేని జీవితం.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. మరీ ఊహిస్తేనే ఇంత దారుణంగా ఉంటే.. నిజంగా అయినవాళ్లను అందర్నీ పొగొట్టుకుని నా అనే వాళ్లు లేక గడుపుతున్న ఆ జీవితం అంధకారంగా ఉంటుంది. సరిగ్గా కేరళకు చెందిన ఓ యువతి జీవితం కూడా ప్రస్తుతం ఇలానే ఉంది.

ఇటీవలే వయనాడ్ వరదల్లో తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న శ్రుతి అనే అమ్మాయి గురించి ఇది వరకే మాట్లాడుకున్న విషయం తెలిసిందే. కుటుంబం మొత్తం కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ అమ్మాయిపై మరోసారి విధి కన్నెర్ర చేసింది. అన్ని తానై జీవితాంతం తోడునీడగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తిని కూడా ఊహించని విధంగా విధి దూరం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

 వయనాడ్  జిల్లా చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి (24) తన  తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయింది. అయితే కుటుంబం మొత్తాన్ని వరదల్లో కోల్పోయి పుట్టేడు దు:ఖంలో ఉన్న ఆమెకు జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ.. చిరకాల మిత్రుడు జెన్సన్ (27) మాట ఇచ్చాడు. కానీ, ఊహించని విధంగా విధి వక్రించి.. ఈ ఇద్దరి ప్రేమ జంటలను విడదీసింది. ప్రాణంగా ప్రేమించిన తన మిత్రుడు, కాబేయ భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు.

సరిగ్గా కోజికోడ్-కొల్లేగల్ జాతీయ రహదారిపై వచ్చేసరికి వీరి వాహనానికి ఓ ప్రైవేట్ బస్సు డీకొన్నది. అయితే ఈ ఘటనలో జెన్షన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతవారికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు వీరిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. జెన్సన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక ఆ పిడుగులాంటి వార్తవ విన్న శ్రుతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చివరికి కట్టుకున్న వాడిని కూడా ఆ దేవుడు దూరం చేయడంతో ఆమె జీవితం ప్రశ్నర్ధకారంగా మారింది.

ఒకవేళ అన్ని మంచిగా జరిగివుంటే.. అసలు వయనాడ్ లో వరదలే రాకుండా ఉంటే, తన కుటుంబ కూడా బ్రతికే ఉండేది. అలాగే ముందుగా అనుకున్న తేదీ (జూన్2వతేదీన) ప్రకారం.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని శ్రుతి సంతోషంగా ఉండేది.  కానీ, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్టు.. ఆ దేవుడు ఇలా అందర్నీ దూరం చేసి ఆ యువతిని జీవితాన్ని తలకిందులైనట్టు చేశాడు. ఎప్పటికీ తీరని లోటును, గుండె బాధను మిగిల్చాడు. ఇక ఈ ఘటన గురించి తెలిసిన స్థానికులంతా ఆ యువతి రోదనను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మరీ, విధి పగబట్టడంతో అందర్నీ కోల్పోయిన  శ్రుతి ఆనాథగా మిగిలిపోయిన  ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet