Keerthi
Ayodhya: దేశ వ్యాప్తంగా రామ భక్తులు ఎదురు చూస్తున్న ఆద్భుతమైన ఘట్టం నేడు కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకను దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రతిష్టించారు. అయితే చాలా మంది వీఐపీలు ఈ కార్యక్రమానికి హజరైయ్యారు. తాజాగా ఆ వేడుకలకు వచ్చిన అతిథులకు ఇచ్చిన ప్రసాదాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకి అవి ఏమిటంటే..
Ayodhya: దేశ వ్యాప్తంగా రామ భక్తులు ఎదురు చూస్తున్న ఆద్భుతమైన ఘట్టం నేడు కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకను దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రతిష్టించారు. అయితే చాలా మంది వీఐపీలు ఈ కార్యక్రమానికి హజరైయ్యారు. తాజాగా ఆ వేడుకలకు వచ్చిన అతిథులకు ఇచ్చిన ప్రసాదాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకి అవి ఏమిటంటే..
Keerthi
ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కల.. ఎందరో మహానీయుల పోరాటం నేడు అయోధ్య రామ మందిరంకు ప్రాణం పోసింది. దేశ వ్యాప్తంగా రామ భక్తులు ఈ ఆద్భుతమైన ఘట్టం కోసం వెయి కళ్లతో వేచి చూసారు. కోట్లాది మంది పరోక్షంగా చూస్తుండగా.. ఆ కొదాండ రాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రామ మందిరాన్ని పూలతో, లైట్లతో అలంకరించారు. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నేరుగా అయోధ్యకి వెళ్లి తిలకించలేని భక్తుల కోసం ప్రత్యేక్ష ప్రసారంగా వీక్షించే ఆవకాశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అభిజిత్ లగ్నం లో వేద పండితులు, వేద మంత్రల సాక్షిగా ఆ రాం లాలా విగ్రహ ప్రాణ ప్రతిష్టను మధ్యహ్నం 12.30 నుంచి 1 గంటల వరకు సాగింది. ఆ బాల రాముడి దివ్యమంగల స్వరూపం చూసి భక్తులు పులకించిపోతున్నారు. అంతేకాకుండా ఈ వేడుకకు చాలా మంది వీఐపీలు హజరైయ్యారు. అయితే తాజాగా ఆ వేడుకలకు వచ్చిన అతిథులకు ఇచ్చిన ప్రసాదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకి అవి ఏమిటంటే..
అయోధ్యలో ఎంతో కన్నుల పండుగగా ఆ బాల రాముడిని విగ్రహా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ రామమందిర ప్రారంభోత్సవానికి చాలామంది వీఐపీలు అయోధ్య నగరానికి చేరుకున్నారు. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయా నాయకులు, టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రీట్ లతో పాటు క్రీడా రంగం నుంచి క్రికెటర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేయుచ్చున్నసుమారు 7 వేల మంది వీవీఐపీలకు అయోధ్య రామ మందిర ఆలయ ట్రస్ట్ ప్రత్యేక మహా ప్రసాద్ ప్యాకెట్లను తయారు చేసింది.
ఇందుకోసం ఆలయ ట్రస్టుకు ఇప్పటికే 20 వేలకు పైగా మహా ప్రసాద్ బాక్స్ లు అందాయి. కాగా, ఒక్కో బాక్స్ లో ఏడు రకాల పదార్థాలను ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఇక ఈ మహా ప్రసాదం బాక్స్ లో ఏమోన్నాయో అంటే ఆలూ చిప్స్, లడ్డూ, నువ్వు చిక్కీలు, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, మఖానాను బాక్స్ లో ఉంచి అతిథులకు అందజేశారు. అయితే దీనిని అయోధ్య ట్రస్ట్ పర్యవేక్షణలో గుజరాత్ కి చెందిన భాగవ సేన భారతి గార్వి, సంత్ సేవా సంస్థా వారు ఈ మహాప్రసాదాన్ని తయారు చేసి కిట్ల రూపంలో అందించాయి. ఈ ప్రసాదాలను తయారుచేయడానికి సుమారు 200 మంది శ్రమించినట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొన్నారు. మరి, అయోధ్య రామమందిర వేడుకలకు హాజరైన అతిథులకు అందించిన ప్రసాదం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.