Arjun Suravaram
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో రైలు పరుగులు తీస్తున్నాయి. తాజాగా ఈ రైల్లో కొత్త వర్షన్ ను ఇండియన్ రైల్వే ప్రవేశ పెట్టనుంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించనుంది.
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో రైలు పరుగులు తీస్తున్నాయి. తాజాగా ఈ రైల్లో కొత్త వర్షన్ ను ఇండియన్ రైల్వే ప్రవేశ పెట్టనుంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించనుంది.
Arjun Suravaram
భారతీయ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో ఈ రైలు పరుగులు తీస్తుంది. 2019లో ప్రారంభమైన ఈ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తుంది. అధునాతన సౌకర్యాలతో వందే భారత్ రైలు పరుగులు పెడుతుంది. ఇప్పటికే ఈ రైలు విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చిన రైల్వేశాఖ మరో కొత్త న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో రైల్వేశాఖ స్లీపర్ వర్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రైలు సిద్ధమవుతున్నాయని సమాచారం.. తాజాగా వందే భారత్ స్లీపర్ తొలి రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ వందే భారత్ స్లీపర్ ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు మార్గాల్లో ఈ రేలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు నడుస్తున్న వందే భారత్ రెండు క్లాసుల కోచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల నుంచి పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా వందే భారత్ లో స్లీపర్ క్లాస్ ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రూ 120 కోట్ల ఖర్చుతో ఒక్కో రైళ్లో స్లీపర్ క్లాస్ లు సిద్దం చేయనుంది.
ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైలులో రాజధాని ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ఇవి ప్రస్తుతం రాత్రవేళ ప్రయాణానికి ప్రీమియం ప్రమాణంగా ఉండనున్నాయి. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రోటోటైప్ 16 కోచ్‌ల రైలుగా 11 ఏసీ 3 టైర్ కోచ్‌లు, 4 ఏసీ 2 టైర్ కోచ్‌లు, ఒక ఏసీ 1వ కోచ్ లతో ఉండనుంది. రైలు మొత్తం 823 మంది ప్రయాణికుల బెర్త్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది 3 టైర్‌లో 611, ఏసీ 2 టైర్‌లో 188, ఏసీ 1లో 24 ఉండనున్నాయని తెలుస్తోంది.
ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వేలు ప్రతి బెర్త్ వైపు అదనపు కుషనింగ్‌ను అందించాలని చూస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే బెర్త్‌లపై కుషనింగ్ మెరుగ్గా ఉంటుంది. ఇక వందే భారత్ స్లీపర్ ఇంటీరియర్ చాలా కొత్తగా ఉండనుంది. ఈ కొత్త రైలు లోపలి భాగం క్రీమ్, పసుపు, కలప రంగులల్లో ఉంటుంది. రైలులో ప్రయాణికులు టాప్, మధ్య బెర్త్‌లను సులభంగా ఎక్కేందుకు మెరుగైన డిజైన్ నిచ్చెనను కలిగి ఉంటుంది. కొత్త రైలులో సెన్సార్ ఆధారిత లైటింగ్, ఎనర్జీ ఎఫెక్టివ్ ఓవర్ హెడ్ లైటింగ్ ఉంటాయి. రాత్రుల్లు సులభంగా నడిచేందుకు నైట్ లైటింగ్ సదుపాయం ఉంటుంది.
ఈ స్లీపర్ రైలులో సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, శబ్దం ఇన్సులేషన్, సైలెంట్ సెలూన్ స్పేస్ కోసం ఉపశమన చర్యలు, ప్రత్యేక బెర్త్‌లు, డిఫరెంట్లీబుల్డ్ కోసం టాయిలెట్లు, ఆటోమేటిక్ ఎక్స్‌టీరియర్ ప్యాసింజర్ డోర్లు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో ప్రయాణం..విమానంలో జర్నీ అనుభూతి కలగనుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ స్లీపర్ కోచ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.