iDreamPost
android-app
ios-app

ఆడి కారు..‌ విమానంలో టూర్లు.. కోట్లలో ఆస్తులు.. ఖరీదైన దొంగ!

  • Published Jul 09, 2024 | 12:22 PM Updated Updated Jul 09, 2024 | 12:22 PM

Rich Thief: డబ్బు ఉంటే లోకం దాసోహం అంటారు. ఆ డబ్బు కష్టపడి సంపాదించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే ఈ మధ్య కొంతమంది కేటుగాళ్ళు తక్కువ సమయంలో లక్షలు, కోట్లు సంపాదించాలని మోసాలకు తెగబడుతున్నారు.

Rich Thief: డబ్బు ఉంటే లోకం దాసోహం అంటారు. ఆ డబ్బు కష్టపడి సంపాదించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే ఈ మధ్య కొంతమంది కేటుగాళ్ళు తక్కువ సమయంలో లక్షలు, కోట్లు సంపాదించాలని మోసాలకు తెగబడుతున్నారు.

  • Published Jul 09, 2024 | 12:22 PMUpdated Jul 09, 2024 | 12:22 PM
ఆడి కారు..‌ విమానంలో టూర్లు.. కోట్లలో ఆస్తులు.. ఖరీదైన దొంగ!

ఇటీవల కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడిపేందుకు ఎన్నో మోసాలు, అక్రమాలకు తెగబడుతున్నారు. ఎదుటి వారికి మాయ మాటలు చెప్పి నిలువెల్లా దోచేస్తున్నారు.  కొంతమంది చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ అమ్మకాలు, దొంగ నోట్ల మార్పు ఇలా ఎన్నో రకాల మోసాలకు పాల్పపడుతు పోలీసులకు సవాల్ విసురుతున్నానారు.  ఓ దొంగ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా  చోరీలు చేస్తూ కోట్లు సంపాదించాడు. ఎలాంటి నేరాలకు చేసిన వారైనా ఎక్కడో అక్కడ చిన్న తప్పు చేస్తూ పోలీసులకు చిక్కిపోతుంటారు. అలాంటి ఘటనే ముంబై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ముంబై కి చెందిన రోహిత్ కనుభాయ్ సోలంకి ఎంతో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. ముంబై శివార్లలో కోట్లు ఖరీదు చేసే ఫ్లాట్ లో నివసిస్తుంటాడు. ఆడి హైఎండ్ కారులో చక్కర్లు కొడుతుంటాడు.. సుదూర ప్రాంతాంలకు వెళ్లాలంటే విమానంలో ప్రయాణిస్తుంటాడు. మొత్తానికి కోటీశ్వరుడైన ఈ రోహిత్ కనుభాయ్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రోహిత్ కనుభాయ్ రిచ్ దొంగ. గుగుల్ ద్వారా సంపన్నుల ప్రాంతాలను గుర్తించి అక్కడ కొన్నిరోజులు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో రాత్రి పూట దొంగతనాలు చేస్తుంటాడు. ఆ ప్రాంతాలో ఖరీదైన స్టార్ హోటల్ లో బసచేస్తుంటాడు. బయట వాళ్లకు తాను ఒక పెద్ద పేరు మోసిన కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు అని చెప్పుకుంటాడు.

రోహిత్ కనుభాయ్ సోలం చేస్తున్న నేరాల గురించి తెలిసిన పోలీసులు ఆయనను పట్టుకునేందుకు వల పన్నారు. ఈ క్రమంలోనే రోహిత్ గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎట్టకేలకు రోహిత్ ని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పపడినట్టు ఒప్పుకున్నాడు. హైదరాబాద్ లో రెండు భారీ దొంగతనాలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వనున్నట్లు వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా తెలిపారు. ముంబైలో ఉంటున్న సోలంకి తన పేరు అర్హాన్ గా మార్చుకొని ఓ మైనర్ యువతిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.