iDreamPost
android-app
ios-app

వీడియో: అందరూ చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయిన వృద్ధుడు!

  • Published Sep 17, 2023 | 12:01 PM Updated Updated Sep 17, 2023 | 12:01 PM
  • Published Sep 17, 2023 | 12:01 PMUpdated Sep 17, 2023 | 12:01 PM
వీడియో: అందరూ చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయిన వృద్ధుడు!

గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీని కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే అచ్చం ఇలాగే పొంగిపోయిన ఓ నది ప్రవాహంలో ఓ వృద్ధుడు అందరిముందే కొట్టుకుపోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఈ వానల కారణంగా ఛోటాడాపూర్ సింగదా గ్రామంలో ధమని నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా నది ప్రవాహం నీటిలో పొలం నుంచి తిరిగి వస్తున్న రథ్వా (55) అనే వృద్ధుడు చిక్కుకుపోయాడు. అందులో నుంచి చాకచక్యంగా బయటపడే ప్రయత్నం చేశాడు. కానీ, ప్రమాదవశాత్తు అందరి కళ్లముందే అతడు ఆ నీటిలో కొట్టుకుపోయాడు. స్థానికులు అప్రమత్తమై వెంటనే ఆ వృద్ధుడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో ఆ వరద నీటిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio