iDreamPost
android-app
ios-app

పెళ్లి రోజు భార్యకు ‘AK 47’ గన్ గిఫ్ట్ గా ఇచ్చిన భర్త!

  • Published Aug 31, 2023 | 10:54 AM Updated Updated Aug 31, 2023 | 10:54 AM
  • Published Aug 31, 2023 | 10:54 AMUpdated Aug 31, 2023 | 10:54 AM
పెళ్లి రోజు భార్యకు ‘AK 47’ గన్ గిఫ్ట్ గా ఇచ్చిన భర్త!

మాములుగా పెళ్లి రోజు ఏ భర్త అయినా భార్యకు ఖరీదైన వస్తువులు, బంగారు గొలుసులు, ఆమెకు నచ్చిన బట్టలు కొని గిప్ట్ గా ఇస్తుంటారు. కానీ, ఓ భర్త మాత్రం.. పెళ్లి రోజు భార్యకు ఏకంగా AK 47 గన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అవును మీరు చదివింది నిజమే. AK 47 గన్ గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటని  అందరూ షాక్ గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. అసలు భర్త భార్యకు అలాంటి గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలని అనుకున్నాడు. అసలు సంగతి ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ నేత రియాజుల్ హకి-సబినా యాస్మిన్ దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే ఇటీవల వీరి పెళ్లి రోజు కావడంతో భర్త రియాజుల్ భార్యకు గుర్తుగా ఓ మంచి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే భార్యకు ‘AK 47’ గన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆది చూసి భార్య సబినా యాస్మిన్ బయపడకుండా మురిసిపోయింది. ఇక ఇంతటితో సరిపెట్టకుండా భర్త ఇచ్చిన గిప్ట్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఇది క్షణాల్లో వైరల్ గా మారి వివాదంగా మారింది. అప్రమత్తమైన ఆమె భర్త రియాజుల్ వెంటనే ఆ ఫొటోను డిలిట్ చేశాడు. కానీ, అప్పటికే చాలా మంది చూశారు.
రియాజుల్ అధికార పార్టీకి చెందిన మాజీ నేత కావడంతో ప్రతిపక్ష పార్టీలు ఇతని తీరుపై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం నడుస్తుంటూ ధ్వజమెత్తారు. మిలటరీ, పారామిలటరీ ఆపరేషన్ వాడే ఇలాంటి గన్ లు మీ వద్దకు ఎలా చేరాయంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే రియాజుల్ స్పందిస్తూ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. నా భార్యకు ఇచ్చింది నిజమైన గన్ కాదని, వెడ్డింగ్ గిఫ్ట్ గా “టాయ్ గన్” ను ఇచ్చానంటూ వివరించాడు. ప్రస్తుతం దీని గురించి నాపై వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కూడా తెలిపాడు. అయితే ఇదే వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet