iDreamPost
android-app
ios-app

చనిపోయిందని తేల్చిన డాక్టర్లు.. అంత్యక్రియలకు తరలిస్తుండగా..

ఆమెకు పెద్ద జబ్బు చేసింది. ఎన్నో ఆసుపత్రులు తిప్పాడు భర్త. ట్రీట్ మెంట్ చేసినా కొద్ది రోజులే చనిపోతుందని చెప్పారట వైద్యులు. దీనికి తోడు బాగా ఖర్చు అవుతుందని చెప్పినా కూడా చికిత్స అందించేందుకు సిద్దమయ్యాడు. అంతలో ఆమె చనిపోయింది.. ఆ తర్వాత ఏమైందంటే..?

ఆమెకు పెద్ద జబ్బు చేసింది. ఎన్నో ఆసుపత్రులు తిప్పాడు భర్త. ట్రీట్ మెంట్ చేసినా కొద్ది రోజులే చనిపోతుందని చెప్పారట వైద్యులు. దీనికి తోడు బాగా ఖర్చు అవుతుందని చెప్పినా కూడా చికిత్స అందించేందుకు సిద్దమయ్యాడు. అంతలో ఆమె చనిపోయింది.. ఆ తర్వాత ఏమైందంటే..?

చనిపోయిందని తేల్చిన డాక్టర్లు.. అంత్యక్రియలకు తరలిస్తుండగా..

విధి ఆడే నాటకంలో అనేక వింతలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్నింటిని చూస్తుంటే.. ఆశ్చర్యంతో పాటు నమ్మకశ్యంగా అనిపించవు..ఏంటీ ఇలా కూడా జరుగుతుంటాయా అన్న ప్రశ్నార్థకాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఒక మనిషి చనిపోయాక.. తిరిగి బత్రికి రావడం చాలా కష్టం. కానీ సైన్సును సవాళ్లు విసురుతూ కొంత మంది చనిపోయాక.. బ్రతుకుతుంటారు. అలాంటి వారిని దైవాంశ సంభూతులని అంటారు. కానీ ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్వయంగా వైద్యులే.. ఆమె చనిపోయిందని నిర్దారించాక.. అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళుతుండగా.. లేచి కూర్చుంది. చదువుతుంటేనే గుండె ఝల్లుమనిపిస్తుంది కదా..

ఇంతకు ఏం జరిగిందంటే ఓ మహిళా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. భోరున ఏడ్చిన కుటుంబ సభ్యులు.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు భర్త, బంధువులు. ఈ ఘటన యుపిలోని హమీర్ పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాఠ్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని సదర్‌ గ్రామానికి చెందిన మతాదిన్‌ రక్వార్‌, అనిత భార్యా భర్తలు. అనిత కొన్ని సంవత్సరాల నుండి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. అనేక ఆసుపత్రులకు తిప్పినా.. ఆమె ఆరోగ్యం బాగుపడలేదు సరికదా.. రోజు రోజుకూ దిగజారింది.

15 రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా.. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. భర్త చెప్పిన దాని ప్రకారం.. డబ్బులు కడితేనే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. రూ.20 వేలు కడితేనే ఆమెకు చికిత్స అందించడం ప్రారంభించారు. మరుసటి రోజు రూ. 60 వేలు కట్టించుకున్నారు. ఠాగూర్ సినిమా లెవల్లో ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు నటించారు. చివరికి అనిత చనిపోయిందంటూ వైద్యులు భర్తకు తెలిపారు. మృతదేహానికి కూడా ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారట. అయితే స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. ఒక్కసారిగా భార్య లేచి కూర్చొందన్నాడు భర్త. ఆ తర్వాత తాగేందుకు మంచి నీళ్లు అడగటంతో ఒక్కసారిగా అవాక్కుతో పాటు భయపడ్డాడట. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మిరాకిల్ వెనుక ఏం జరిగి ఉంటుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి