iDreamPost
android-app
ios-app

మార్కెట్‌లో రొమాన్స్ స్కాం! ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా?

  • Published Nov 14, 2023 | 1:45 PM Updated Updated Nov 14, 2023 | 1:45 PM

అమ్మాయి చూస్తే చాలురా అనుకుంటే నవ్వితే.. ఇక పడిపోతారు. మాటలు కలిపితే.. మురిసిపోతుంటారు. ఇక ఆమె నామస్మరణ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఆఫీస్ ఎక్కడ చూసినా గర్ల్ ఫ్రెండ్ గోలే. అలాంటిది డేటింగ్ కు పిలిస్తే ఆగుతారా..?

అమ్మాయి చూస్తే చాలురా అనుకుంటే నవ్వితే.. ఇక పడిపోతారు. మాటలు కలిపితే.. మురిసిపోతుంటారు. ఇక ఆమె నామస్మరణ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఆఫీస్ ఎక్కడ చూసినా గర్ల్ ఫ్రెండ్ గోలే. అలాంటిది డేటింగ్ కు పిలిస్తే ఆగుతారా..?

  • Published Nov 14, 2023 | 1:45 PMUpdated Nov 14, 2023 | 1:45 PM
మార్కెట్‌లో రొమాన్స్ స్కాం! ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా?

‘అందం చూడవయ్యా ఆనందించవయ్య’ అన్నట్లు అయిపోయింది డేటింగ్ యాప్స్ పరిస్థితి. సరదాగా అమ్మాయిలతో చిట్ చాట్, పర్సనల్ విషయాలు షేరింగ్, అందంగా కనిపిస్తే చాలు ఇక సొల్లు మాటలకు హద్దు పొద్దు ఉండనే ఉండదు. పక్కనోడు పిలుస్తున్నా పట్టించుకోరు.. ఒంటి మీద దుస్తులు జారి పోతున్నా.. యాప్స్‌లో తగిలిన అమ్మాయితో గంటల గంటల పాటు మచ్చట్లు. ఆ యువతి ఎలాంటిది అనేది అనవసరం. బాగా మాట్లాడుతుంది కదా, తన మేసేజ్ ను బాగా రిసీవ్ చేసుకుని, రిప్లై ఇస్తుంది కదా అని అనుకుంటున్నారంతే. కానీ మాయల మరాఠి అని గ్రహించలేకపోతున్నారు. అదే తెలియని ఓ వ్యక్తి.. యువతికి బలయ్యాడు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

బబుల్ అనే డేటింగ్ యాప్.. లవ్వర్, గార్ల్ ఫ్రెండ్ లేని వాళ్లు ఈ డేటింగ్ యాప్ ద్వారా మూడు నాలుగు గంటల పాటు సరదాగా బయట చిట్ చాట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారానే సరదాగా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ యువకుడు. ఇంకేముంది ఫటాఫట్.. ధనా ధన్.. ఫోటో పంపింది. అతడికి నచ్చింది. ఇంకేముంది రెండు రోజుల్లోనే గిప్సీ రెస్టో అండ్ బార్ కమ్ పబ్‌లో కలుద్దాం అని చెప్పింది. అదీ కూడా కొంత సమయమే అని కండిషన్ పెట్టింది. అమ్మాయి ఆఫర్ ఇస్తే.. కాదనేదేముంది. ఇద్దరూ బుక్ చేసుకున్న టేబుల్ వద్దకు వచ్చారు. రాగానే హుక్కా, వైన్ ఆర్డర్ ఇచ్చేసింది. అతడు రేటు కూడా కనుక్కునేలోపు.. ఆ రెస్టారెంట్ కం బార్ స్టాఫ్ ఆమె ఆర్డర్ చేసినవీ నిమిషాల్లో తీసుకొచ్చి ఇచ్చారు.

ఇక స్పెషల్ వైన్ గ్లాస్, చిల్లీ పొటాటో, క్రిస్పీ కార్ష్, వాటర్ బాటిల్ అంతా కలిసి బిల్లు 23 వేల రూపాయలు వచ్చింది. ఏంటీ ఇంత బిల్లా అని ఆశ్చర్యపోయే సరికి.. ‘కట్టు లేకుంటే.. పార్కింగ్‌లో ఉన్న నీ కారు డ్యామేజ్ చేస్తారు ఈ రెస్టారెంట్ సిబ్బంది. బిల్లు కట్టకుండా పారిపోవాలనుకుంటే.. నీ  కారు నెంబరు తెలుసు కాబట్టి.. ఆర్టీఓ ఆఫీసులో అడ్రస్ తీసుకుని.. నీ ఇంటికి వచ్చి డబుల్ వసూలు చేస్తాం. అలాగే నాతో డేటింగ్ కు వచ్చావని మీ ఇంట్లో చెబుతాం’అని బెదిరించే సరికి కట్టి.. ప్రాణాలతో బయటపడ్డానని ఆవేదన వెళ్లగక్కాడు. ఇదంతా అమ్మాయి.. ఆ పబ్ అంతా కలిసి ఆడిన నాటకమని, అదొక దందా అని గ్రహించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. తనలా మోసపోకూడదని ఈ విషయాన్ని పంచుకున్నట్లు తెలిపాడు. ఇక నెటిజన్లు.. కామెంట్లతో దూసుకుపోతున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio