P Krishna
Auto Driver: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
Auto Driver: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
P Krishna
దేశంలో ప్రతిరోజు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంది. కానీ వాహనదారులు మాత్రం ఎప్పుడూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణం అవుతూనే ఉన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలోె నిర్లక్ష్యం, నిద్ర లేమి, అవగాహన లేకుండా నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు ఓ ఆటో డ్రైవర్ కి కోర్డు వినూత్నమైన శిక్ష విధించింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కానీ కొంతమంది వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా తన పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి సరైన బుద్ది వచ్చేలా చేస్తుంది కోర్టు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నై నీలాంగరై సమీపంలో వేట్టువాంగేని ప్రాంతానికి చెందిన వివేక్ (33) ఆటో డ్రైవర్. ఈ నెల 4న ఇంటికి వెళ్లందుకు ఈస్ట్ బీచ్ రోడ్డు వెట్టువంగేని జంక్షన్ లో రాంగ్ రూట్ లో వాహనం నడుతూ వచ్చాడు. ఆ సమయంలో వివేక్ ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది.. అక్కడ విధుల్లో ఉన్న నీలాంగరై ట్రాఫిక్ మహిళా పోలీస్ ప్రియ వాహనాల తాళాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. అంతలోనే వివేక్ ఆమెపై దూసుకు వెళ్లి దుర్భాషలాడి అడ్డుకున్నాడు.
ఈ విషయంమై ప్రియ నీలాంగరై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షోలింగనల్లూర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచాడు. వివేక్ బెయిల్ కోరుతూ పిటీషన్ వేయగా ఆ పిటీషన్ విచారించిన మెజిస్ట్రేట్ కార్తీక్ వినూత్న షరతులతో బెయిల్ మంజూరు చేశారు. ప్రతిరోజూ నీలాంగరై పోలీస్ స్టేషన్ కి హాజరై ఉదయం, సాయంత్రం సంతకం చేయాలి. వారం పాటు వేట్టువాంగేవి సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ను ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయత్రం 5 నుంచి 7 గంటల వరకు నియంత్రించాలని ఆదేశించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి ఆటోడ్రైవర్ వివేక్ కాస్త ట్రాఫిక్ పోలీస్ లా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ విషయం అక్కడ చర్చనీయాంశంగా మారింది.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తే ఇంకెలాంటి శిక్షలు పడతాయో అంటున్నారు స్థానికులు.