iDreamPost
android-app
ios-app

వీడియో: మైనర్ లగ్జరీ కారు నడుపుతుంటే..బానెట్‌పై యువకుడు! చివరికి..

  • Published May 28, 2024 | 9:22 AM Updated Updated May 28, 2024 | 9:56 AM

Teenager Driving at Mumbai: ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు గారాభంతో పిల్లలకు బైకులు, కార్లు ఇవ్వడం వల్ల తెలిసీ తెలియని డ్రైవింగ్‌తో యాక్సిడెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Teenager Driving at Mumbai: ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు గారాభంతో పిల్లలకు బైకులు, కార్లు ఇవ్వడం వల్ల తెలిసీ తెలియని డ్రైవింగ్‌తో యాక్సిడెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

వీడియో: మైనర్ లగ్జరీ కారు నడుపుతుంటే..బానెట్‌పై యువకుడు! చివరికి..

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య దారుణంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని.. కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దని తల్లిదండ్రులకు ఎంతగా చెప్పినా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. తెలిసీ తెలియని డ్రైవింగ్ తో నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. పూణే నగరంలో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు ప్రాణాలు బలితీసుకున్నాడు. ఈ ఘటన దేశం మొత్తం సంచలనం రేపింది. అలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకోవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్యనే మహారాష్ట్ర పూణే‌లో ఓ బాలుడు లగ్జరీ కారును ర్యాష్ గా డ్రైవ్ చేయడం వల్ల ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన దేశం మొత్తం విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సంఘటనకు సంబంధించిన బాలుడు, కారు ఇచ్చినందుకు తండ్రిని, డ్రైవర్ ని ఇరికించే ప్రయత్నం చేసిన బాలుడు తాత, రక్త నివేదిక నమూనాలు మార్చినందుకు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతుంది. అచ్చం అలాంటి కేసు ముంబైలో ఒకటి వెలుగులోకి వచ్చింది.. కాకపోతే ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు.

ముంబైలో ఓ మైనర్ లగ్జరీ కారును నడుపుతుంటే మరో యువకుడు కారు బానెట్ పై కూర్చొని ఉన్నాడు.నగరంలోని రద్దీ ప్రాంతం అయిన శివాజీ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఓ బాలుడు బీఎండబ్ల్యూ కారు నడుపుతున్నాడు.. బానెట్ పై భుభమ్ మితాలియా అనే ఓ యువకుడు దర్జాతా కూర్చొని ఫోజులిచ్చాడు. అక్కడే ఉన్న కొంతమంది దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో వెంటనే స్పందించారు.. బాలుడికి కారు ఇచ్చినందుకు అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. అలాగే బానెట్ పై కూర్చొన్న యువకుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పబ్లిక్ లో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినందుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.