Dharani
Dharani
సమాజంలో మృగాళ్లు పెరిగిపోతున్నారు. కామంతో కన్ను మిన్ను మానక.. ఆడదైతే చాలు వయసుతో కూడా సంబంధం లేకుండా పశువుల్లా వారి మీద పడి జీవితాలను నాశనం చేస్తున్నారు. 100లో నూటికి 90 మంది మహిళలు, చిన్నారులు లైంగిక వేధింపులు, అత్యాచారాల బారిన పడుతున్నారంటే ఎలాంటి భయానక పరిస్థితుల్లో బతుకున్నామో అర్థం చేసుకోవచ్చు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అని పెద్ద పెద్ద మాటలు చెబుతా.. కానీ ఆచరణలో మాత్రం.. వావి వరసలు మరిచి, వయసు కూడా పట్టించుకోకుండా.. పశువుల్లా వారి మీద పడి జీవితాలను నాశనం చేసే మృగాళ్లు కోకొల్లలు మన సమాజంలో. అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. మంచిగా నటిస్తూ.. దగ్గరకు తీసుకునే నేపంతో.. పసివాళ్లపై పైశాచిక చర్యలకు పాల్పడుతుంటారు కొందరు రాక్షసులు.
అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసిన వారే.. తమను ఎక్కడెక్కడో తడుముతూ.. ఇబ్బందికి గురి చేస్తుంటే.. ఏం చేయాలో అర్థం కాక.. అమ్మానాన్నలకు చెబితే ఏం అంటారో తెలియక.. భయంగా బతుకుతూ.. భవిష్యత్తులో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో.. పిల్లలకు బాల్యం నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌కు మధ్య బేధాలు అర్థం అయ్యేలా చెప్పాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో టీచర్లే.. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బోధిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది.
ఈ వీడియోని స్కూల్లో తీశారు. ఇక్కడ ఓ లేడీ టీచర్.. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించడమే కాక ప్రాక్టికల్‌గా చూపించింది. కొందరు విద్యార్థులను దగ్గరకు తీసుకుని.. వారి శరీరంలో వేరు వేరు చోట్ల టచ్ చేస్తూ అది ఎలాంటి స్పర్శ అవుతుంది.. గుడ్డా, బ్యాడా.. ఒకవేళ సదరు వ్యక్తి మనల్ని టచ్ చేసినప్పుడు.. మనకు ఇబ్బందిగా అనిపిస్తే.. వద్దని చెప్పడం ఎలా.. ఇలా మనల్ని ఇబ్బందులకు గురి చేసే వారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చాలా చక్కగా వివరించింది. టీచర్ మాట్లాడే విధానం, పిల్లలకు అర్థం అయ్యే విధంగా ప్రాక్టీకల్‌గా చూపించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తల్లిదండ్రులందరూ ఈ వీడియోని తప్పక చూడాలని.. చిన్నప్పటి నుంచే ఇలాంటి విషయాల గురించి పిల్లలకు అవగాహనం కల్పించడం చాలా మంచి ప్రయత్నం అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు.
This teacher deserves to get famous 👏
This should be replicated in all schools across India.
Share it as much as you can. pic.twitter.com/n5dx90aQm0
— Roshan Rai (@RoshanKrRaii) August 8, 2023