iDreamPost
android-app
ios-app

వీడియో: టీచర్​ను చెప్పులతో తరిమికొట్టిన విద్యార్థులు.. ఎందుకో తెలుసా?

  • Published Mar 27, 2024 | 3:58 PM Updated Updated Mar 27, 2024 | 3:58 PM

స్కూల్​లోని విద్యార్థులు అందరూ కలసి ఉపాధ్యాయుడ్ని తరిమికొట్టారు. చెప్పులతో అతడిపై దాడికి దిగారు. అసలు పాఠాలు చెప్పే గురువుపై స్టూడెంట్స్ ఎందుకు దాడికి దిగారో ఇప్పుడు తెలుసుకుందాం..

స్కూల్​లోని విద్యార్థులు అందరూ కలసి ఉపాధ్యాయుడ్ని తరిమికొట్టారు. చెప్పులతో అతడిపై దాడికి దిగారు. అసలు పాఠాలు చెప్పే గురువుపై స్టూడెంట్స్ ఎందుకు దాడికి దిగారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 27, 2024 | 3:58 PMUpdated Mar 27, 2024 | 3:58 PM
వీడియో: టీచర్​ను చెప్పులతో తరిమికొట్టిన విద్యార్థులు.. ఎందుకో తెలుసా?

గురువును మించిన దైవం లేదని అంటారు. భారతీయ సంస్కృతిలో గురువుకు ఎంతో గౌరవం ఇస్తారు. తల్లిదండ్రుల తర్వాత గురువే ఎక్కువ అని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో పైకి రావాలంటే విద్య నేర్పే వాళ్లే కీలకం. అందుకే కొన్ని విషయాల్లో పేరెంట్స్ కంటే కూడా మంచి గైడెన్స్​తో జీవితాన్ని మార్చేసే గురువుల పాత్ర ముఖ్యమైనదిగా పెద్దలు చెబుతుంటారు. అలా విద్యార్థుల తలరాతలు మార్చిన ఉపాధ్యాయులు కూడా ఎంతో మంది ఉన్నారు. మంచి టీచర్స్ దొరికితే స్టూడెంట్స్ లైఫ్​లో ఏదైనా సాధించగలరు. విద్యాబుద్ధులు నేర్పించి సరైన దారిలో నడిపించే వాళ్లు ఉంటే అంతకంటే అదృష్టం ఉండదు. అయితే గుడ్ టీచర్స్​తో పాటు కొందరు బ్యాడ్ టీచర్స్​ కూడా ఉన్నారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడికి పిల్లలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. చెప్పులతో తరిమి కొట్టారు.

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బస్తర్​లోని ఓ గవర్నమెంట్ స్కూల్​లో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. బస్తర్ జిల్లాలోని పిలిభట్ట పాఠశాలకు చెందిన ఓ టీచర్ ప్రతి రోజూ మద్యం సేవించి స్కూల్​కు వచ్చేవాడు. ఆల్కహాల్ తాగి పాఠశాలకు రావడం కామన్​గా మారిపోయింది. తాగిన మత్తులో స్కూల్​లోని విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కొట్టడం చేసేవాడట. దీంతో ఆ ఉపాధ్యాయుడి చేష్టలకు విసిగిపోయారు విద్యార్థులు. అవకాశం దొరికితే అతడికి బుద్ధి చెబుదామని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల ఆ టీచర్ మళ్లీ అలాగే తాగి స్కూల్​కు వచ్చాడు. అంతే ఎదురు చూస్తున్న సమయం రావడంతో స్టూడెంట్స్ అతడి మీద తిరగబడ్డారు. చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. చెప్పులతో కొడుతూ స్కూల్​లో నుంచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఎన్నడూ లేనిది స్టూడెంట్స్ అంతా కలసి కొట్టడం, చేతికి అందిన దాంతో దాడికి దిగడంతో భయపడ్డాడా ఉపాధ్యాయుడు. ఏం చేయాలో పాలుపోకపోవడంతో పార్క్ చేసి ఉన్న తన బైక్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. స్కూల్ కాంపౌండ్ దాటే వరకు అతడ్ని రాళ్లు, చెప్పులతో కొడుతూనే ఉన్నారు పిల్లలు. మొత్తానికి అతడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. తాగొచ్చి పాఠాలు చెప్పకుండా తిట్టే ఇలాంటి వారి వల్ల టీచర్లకు సమాజంలో విలువ తగ్గిపోతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఇలా బుద్ధి చెబితేనే వింటారని అంటున్నారు. మరి.. టీచర్​పై విద్యార్థులు అటాక్ చేయడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.