iDreamPost
android-app
ios-app

చాయ్ వాలా కూతురు CA పాస్! సక్సెస్ అంత ఈజీగా రాలేదు!

  • Published Jul 21, 2024 | 4:57 PM Updated Updated Jul 21, 2024 | 4:57 PM

అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది కొన్ని సార్లు మాత్రమే ప్రయత్నం చేసి..విఫలమైతే విడిచిపెడుతుంటారు. కానీ ఓ అమ్మాయి 10 ఏళ్ల తరువాత విజయం సాధించింది.

అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది కొన్ని సార్లు మాత్రమే ప్రయత్నం చేసి..విఫలమైతే విడిచిపెడుతుంటారు. కానీ ఓ అమ్మాయి 10 ఏళ్ల తరువాత విజయం సాధించింది.

  • Published Jul 21, 2024 | 4:57 PMUpdated Jul 21, 2024 | 4:57 PM
చాయ్ వాలా కూతురు CA పాస్! సక్సెస్ అంత ఈజీగా రాలేదు!

విజయం..వినడానికి, చదవడానికి ఇది మూడు అక్షరాల పదమే. కానీ అందుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే. అలానే ఈ విజయాన్ని సాధించే క్రమంలోనే ఎన్నో అవమానాలు, అవరోధాలు, మానసిక సంఘర్షణలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ విజయం వైపు అడుగులు వేసే వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారే వెలుగులోకి వచ్చి సమాజం చేత గుర్తింపు అందుకుంటారు. అలాగా ఏదైనా అపూర్వ విజయాన్ని పొందినప్పుడు ఆ సంతోషానికి అవధులు ఉండవు. తాజాగా ఓ టీ అమ్మే వ్యక్తి కుమార్తె దాదాపు 10 ఏళ్ల తరువాత సీఏ పాస్ అయ్యింది. ఈ క్రమంలో తండ్రీని పట్టుకుని ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది కొన్ని సార్లు మాత్రమే ప్రయత్నం చేసి..విఫలమైతే విడిచిపెడుతుంటారు. అలానే మరికొందరు నాలుగైదేళ్లు ప్రిపేర్ అయ్యి.. విఫలవ అయితే వదిలేస్తుంటారు. కానీ ఓ యువతి మాత్రం పట్టువదలకుండా..ఎన్ని అవమానాలు ఎదురైన..తన తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపు 10 ఏళ్ల పాటు కృషి చేసింది. చివరకు విజయం సాధించింది.  ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి పదేళ్ల తరువాత సీఎం పాసైంది.

అనంతరం తండ్రిపై పడి భావోద్వేగాన్ని పంచుకున్నా వీడియోను ఆమె షేర్ చేశారు. దీనికి లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. బంధువులు ఎన్ని మాటలన్నా తన తండ్రి పట్టించుకోకుండా, ఆర్థిక సమస్యలను తట్టుకొని తనను చదివించి సీఏ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అమితా తండ్రి ఓ ఛాయ్ దుకాణం నడుపుతుండే వారు. ఆ షాపు మీద వచ్చిన సంపాదనతో వారు జీవనం సాగించే వారు. వాళ్ల ఇళ్లు మురికి వాడలో ఉండేది. వారికి ఆర్థికం సమస్యలు ఉన్నప్పటికీ.. అమితా  తండ్రి మాత్రం..ఆమెను సీఎం చదివిచడం మానలేదు. ఆమె చాలా సార్లు సీఏ పరీక్షల్లో విఫలమవుతున్నా.. ప్రోత్సహిస్తూ.. ధైర్యాన్నిచ్చే వాడు.

ఇదే సమయంలో అమితా పలు మార్లు సీఎం పరీక్షల్లో విఫలమవుతుండటంతో బంధువులు, తోటి వారు హేళన చేసేవారు. అలాంటి సందర్భంలో కూడా అమితా తండ్రి..ఆమెకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. అలా తండ్రి పోత్సాహంతో పట్టు వదలకుండా  10 ఏళ్ల పాటు చదివింది. చివరకు పదేళ్ల తరువాత సీఏ పాసై..తాను అనుకున్నది సాధించింది. అనంతరం తండ్రి వద్దకు వెళ్లి..ఆయనను గట్టిగా పట్టుకుని కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా..నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి నిరుత్సాహానికి గురయ్యే యవత..కు నీవే స్పూర్తి అంటూ అమితాపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş