Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు కొత్త రూల్స్‌….ఇక నుదిటిపై తిలకం నిషేధం! కారణం?

తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సంబంధించి కొత్త రూల్స్‌ అమలు చేయడానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా విద్యార్థులు నుదిటిపై తిలకం పెట్టుకుని స్కూల్‌కి రావడాన్ని నిషేధించింది. ఎందుకంటే..

తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సంబంధించి కొత్త రూల్స్‌ అమలు చేయడానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా విద్యార్థులు నుదిటిపై తిలకం పెట్టుకుని స్కూల్‌కి రావడాన్ని నిషేధించింది. ఎందుకంటే..

విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వాలు అప్పుడప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు సంచలనంగా ఉండటం మాత్రమే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారతాయి. గతంలో కర్ణాటకలో తరగతి గదుల్లోకి హిజాబ్‌ ధరించి రావడం.. పెద్ద వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీకోర్టు వరకు వెళ్లింది. దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఇలా ఉండగా తాజాగా తమిళనాడు ప్రభుత్వం మరి కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఇక మీదట నుదుటిని తిలకం ధరించకూడదు.. అలానే తన పేరులో కులాన్ని చేర్చుకోకూడదు. అలా చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంతకు ఈ రూల్స్‌ ఎందుకు అంటే..

తమిళనాడు ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులు నుదుటికి తిలకం, చేతికి ఉంగరాలు, బ్యాండ్‌, పేరులో కులాన్ని చేర్చుకోకూడదంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థులు ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనల అమలుకు సంబంధించి త్వరలోనే అధికారిక గెజిట్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో తలెత్తే కులవివాదాలను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. దీనిపై ఏడాది క్రితమే ఓ కమిటీని వేశారు. తాజాగా అది నివేదికను సమర్పించింది. 2023లో మద్రాసు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె. చంద్రు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ.. తాజాగా తన సిఫార్సులను ముఖ్యమంత్రికి సమర్పించింది.

అయితే స్టాలిన్‌ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం.. గత ఏడాది అనగా 2023, ఆగస్టులో తిరునెల్వేలి, నంగునేరులోని ఓ పాఠశాలలో ఎస్సీ సాఆమజిక వర్గానికి చెందని అన్నదమ్ములపై.. కుల వివక్ష కారణంగా మరో సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. పాఠశాలల్లో కులవివక్షను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలయజేయాలని కోరుతూ జస్టిస్‌ కె. చంద్రు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా అది ఇచ్చిన సిఫార్సుల మేరకు స్టాలిన్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయడానికి రెడీ అవుతోంది.

కుల వివక్షను తొలగించేందుకు..

పాఠశాల్లలో కుల వివక్షను తొలగించేందుకు స్టాలిన్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా విద్యార్థులు కులాన్ని సూచించే రిస్ట్‌ బ్యాండ్‌లు, ఉంగరాలు, నుదిటి గుర్తులు ధరించి స్కూల్‌కు రావడాన్ని నిషేధించాలని భావిస్తోంది. అలానే విద్యార్థుల సైకిళ్లపై కులాన్ని తెలియజేసే చిత్రాలను ముద్రించడం.. అలా ఉన్న వాటిని స్కూల్‌కు తీసుకురావద్దని తెలిపింది. విద్యార్థులు ఈ నిబంధనలు పాటించకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని.. అలానే దీని గురించి స్టూడెంట్స్‌ తల్లిదండ్రులు, సంరక్షకులకు తెలియజేయాలని నివేదికలో పేర్కొన్నారు. స్కూల్‌, కాలేజీ ప్రాంగాణాల్లో కుల, మతపరమైన కవాతులు, డ్రిల్‌లు నిర్వహించడాన్ని నిషేధించాలని నివేదికలో తెలిపారు. అంతేకాక 6-12 తరగతుల విద్యార్థులకు సామాజిక సమస్యలు, కుల వివక్ష, లైంగిక హింస, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కచ్చితంగా నిర్వహించాలని సూచించారు.

Show comments