Uppula Naresh
తెల్లని పాలరాయితో మెరుస్తూ ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్ మహల్ రంగు ఇప్పుడు పూర్తిగా మారుతూ వస్తోంది. ఈ విషయం తెలుసుకుని పర్యాటలకు ఆందోళన చెందుతున్నారు. అసలు తాజ్ మహల్ రంగు ఎందుకు మారుతుందంటే?
తెల్లని పాలరాయితో మెరుస్తూ ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్ మహల్ రంగు ఇప్పుడు పూర్తిగా మారుతూ వస్తోంది. ఈ విషయం తెలుసుకుని పర్యాటలకు ఆందోళన చెందుతున్నారు. అసలు తాజ్ మహల్ రంగు ఎందుకు మారుతుందంటే?
Uppula Naresh
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. తెల్లని పాలరాయితో మెరుస్తూ ప్రేమకు చిహ్నంగా నిలిచింది. ఎంతో సుందరంగా ఉండే దీనిని చూసేందుకు మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఈ అందమైన తాజ్ మహల్ ఇప్పుడు మెల్ల మెల్లగా పూర్తిగా కలర్ మారుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఉన్నట్టుండి తాజ్ మహల్ ఇలా రంగు మారడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. తెల్లని పాలరాయితో మెరిసే తాజ్ మహల్ ఉన్నట్టుండి ఎందుకు రంగు మారింది? దీనికి గల కారణం ఏంటనే పూర్తి వివరాలు మీకోసం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో ప్రేమకు నిదర్శనంగా వెలిసింది తాజ్ మహల్. దీన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. కానీ, అదే తాజ్ మహల్ ఇప్పుడు తెల్లటి పాలరాతి రంగు నుంచి గ్రీన్ కలర్ లోకి వస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఇదే విషయాన్ని తాజాగా ఆర్కియాలజిస్ట్ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఉన్నట్టుండి తాజ్ మహల్ ఎందుకు గ్రీన్ రంగులోకి మారింది? అసలు విషయం ఏంటంటే! యమునా నదిలో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువగా గోల్డీ చిరోనోమస్ అనే కీటకాలు పెరిగిపోతున్నాయి. వీటికి తెలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. తద్వారా ఈ గోల్డీ చిరోనోమస్ కీటకాలు అందులో ఉండే నాచు తిని అక్కడి నుంచి నేరుగా తాజ్ మహల్ పై వాలుతున్నాయి.
ఆ తర్వాత కొన్ని లక్షల సంఖ్యల్లో ఉండే కీటకాలు అక్కడే విసర్జిస్తూ ఉన్నాయి. ఇలా కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగి తాజ్ మహల్ పై వాలుతూ విసర్జీస్తూ ఉండడంతో తాజ్ మహల్ అంతా ప్రస్తుతం తెలుపు రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతుందని ఆగ్రాలోని ASI సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ వెల్లడించారు. ఈ రకమైన కీటకాలు నిరోధించడానికి ASI చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. అయితే, ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో గోల్డీ చిరోనోమస్ కీటకాలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఇలా జరగడం తాజ్ మహల్ ఇలా రంగు మారడం ఇప్పుడు కొత్తమే కాదని, గతంలో కూడా రంగు మారినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యమునా నదిలో కాలుష్యం పెరిగి పోవడంతో దీని కారణంగా గోల్డీ చిరోనోమస్ ఎక్కువగా సంతానోత్పత్తి జరిగి ఇలా తాజ్ మహల్ అందాన్ని నాశనం చేస్తున్నాయి చెబుతున్నారు.