iDreamPost
android-app
ios-app

Swiggy 2023: ఈ ఏడాది స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటో తెలుసా? ఆ వంటకానిదే గెలుపు!

  • Published Dec 14, 2023 | 8:33 PM Updated Updated Dec 14, 2023 | 8:33 PM

స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్​లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అయితే ఎక్కువ మంది ఏ వంటకం కోసం ఆర్డర్ పెడుతున్నారో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్​లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అయితే ఎక్కువ మంది ఏ వంటకం కోసం ఆర్డర్ పెడుతున్నారో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 14, 2023 | 8:33 PMUpdated Dec 14, 2023 | 8:33 PM
Swiggy 2023: ఈ ఏడాది స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటో తెలుసా? ఆ వంటకానిదే గెలుపు!

ఇంటి భోజనం బోర్ కొట్టినా సరదాగా బయట తినాలని అనుకున్నా ఒకప్పుడు అందరూ హోటల్స్​, రెస్టారెంట్స్​కు వెళ్లేవారు. కానీ కరోనా తర్వాత ఈ పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ ఫుడ్ ఐటమ్ కావాలన్నా అందరూ ఆన్​లైన్​లోనే ఆర్డర్ చేసేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్​ ద్వారా తమకు నచ్చిన వంటకాలను తెప్పించుకుంటున్నారు. కొవిడ్-19 ముందు నుంచి ఈ సంస్థలు ఉన్నా ఆ తర్వాతే వీటికి డిమాండ్ పెరిగింది. అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేయడం, ఫోన్​పే, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి రావడంతో అందరూ మొబైల్స్​లో నుంచే నచ్చినవి ఆర్డర్ చేసుకుంటున్నారు. అందుకే స్విగ్గీ, జొమాటోలు చాలా పాపులర్ అయిపోయాయి. వీటి ద్వారా ఎంతో మందికి కూడా ఉపాధి దొరుకుతుండటం గమనార్హం. అదే టైమ్​లో హాటల్స్, రెస్టారెంట్స్​కు కూడా ఆదాయం పెరుగుతోంది.

కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్​కు నేరుగా వచ్చే కస్టమర్స్​ కంటే స్విగ్గీ, జొమాటో ఆర్డర్​ల ద్వారా రెవెన్యూ ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. దీన్ని బట్టే ఈ బిజినెస్ ఎంతగా వృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. పొద్దున తినే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్ ఐటమ్స్ నుంచి మీల్స్, బిర్యానీ వరకు ప్రతిదీ డెలివర్ చేస్తుండటంతో స్విగ్గీ, జొమాటోకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఈ యాప్స్​లో ఏ ఫుడ్​ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరగడం సహజమే. గతేడాది స్విగ్గీలో అత్యధిక మంది వినియోగదారులు బిర్యానీని ఆర్డర్ చేశారు. దీంతో ఈ సంవత్సరం ఆ ప్లేస్​ను ఏ వంటకం కొట్టేస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి కూడా మరో ఫుడ్ ఐటమ్​కు ఛాన్స్ ఇవ్వలేదు బిర్యానీ.

2023లో స్విగ్గీలో అత్యధికంగా అమ్ముడుపోయింది బిర్యానీనే కావడం విశేషం. వరుసగా ఎనిమిదో ఏడాది బెస్ట్ ఆర్డర్డ్​ డిష్​గా నిలిచి రికార్డు సృష్టించింది బిర్యానీ. ‘హౌ ఇండియా స్విగ్గీడ్ 2023’ అనే రిపోర్ట్​లో ఈ విషయాన్ని వెల్లడించింది స్విగ్గీ. తమ ప్లాట్​ఫామ్​లో ఎక్కువ మంది కస్టమర్లు బిర్యానీనే ఆర్డర్ చేశారని తెలిపింది. ఈ సంవత్సరం సగటున 1 సెకన్​కు 2.5 బిర్యానీలు ఆర్డర్ చేశారట. ఒక్క జనవరి నెలలోనే ఏకంగా 4,30,000 బిర్యానీలు ఆర్డర్ పెట్టారట. జనవరి 1 నుంచి నవంబర్ 23 వరకు చేసిన జరిగిన విక్రయాల డేటాను బట్టి ఈ ఏడాది ఏకంగా 2.49 మిలియన్ల మంది కస్టమర్లు స్విగ్గీలో బిర్యానీ కోసం ఆర్డర్లు చేశారట.

దేశంలోని అన్ని నగరాల్లోకెల్లా హైదరాబాద్​లోనే బిర్యానీని ఎక్కువ మంది ఆర్డర్ చేయడం గమనార్హం. తద్వారా భాగ్యనగర ప్రజలకు ఈ వంటకం మీద ఉన్న ప్రేమ ఏంటో మరోమారు ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి అయితే ఈ ఏడాదిలో ఏకంగా 1,633 బిర్యానీ ఆర్డర్లు పెట్టడం మరో విశేషం. తెలంగాణ రాజధానిలో రూ.6 లక్షల విలువైన ఇడ్లీ ఆర్డర్లు పెట్టడం మరో హైలైట్. ఢిల్లీ, చెన్నైతో పాటు దేశంలో స్విగ్గీ ఆర్డర్లు ఎక్కువగా అయింది హైదరాబాద్ నుంచేనని ఆ రిపోర్టు వెల్లడించింది. మరి.. స్విగ్గీలో మీరు ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకం ఏదో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బిగ్ బాస్ -7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్? ఇక్కడ లెక్కలు క్లియర్ గా ఉన్నాయి!