iDreamPost
android-app
ios-app

Swiggy సంస్థ మోసం! కోర్టుకి ఈడ్చి ఫైన్ కట్టించిన సామాన్యుడు! కోర్టు కూడా ఆగ్రహం!

  • Published Apr 30, 2024 | 4:02 PM Updated Updated Apr 30, 2024 | 4:02 PM

ఈ మధ్య స్వీగ్గి సంస్థ, అందులో పనిచేసే వ్యక్తులు చేసిన నిర్వాకాలు ఏదో విధంగా వెలుగులోకి వస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ కస్టమర్ కు కూడా స్విగ్గీ సంస్థ నుంచి ఊహించని షాక్ తగిలింది. దీంతో నష్టం పరిహారం కింద స్విగ్గీ సంస్థ కస్టమర్ కు రూ.5000 వేలు చెల్లించింది. అసలు ఏం జరిగిందంటే..

ఈ మధ్య స్వీగ్గి సంస్థ, అందులో పనిచేసే వ్యక్తులు చేసిన నిర్వాకాలు ఏదో విధంగా వెలుగులోకి వస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ కస్టమర్ కు కూడా స్విగ్గీ సంస్థ నుంచి ఊహించని షాక్ తగిలింది. దీంతో నష్టం పరిహారం కింద స్విగ్గీ సంస్థ కస్టమర్ కు రూ.5000 వేలు చెల్లించింది. అసలు ఏం జరిగిందంటే..

  • Published Apr 30, 2024 | 4:02 PMUpdated Apr 30, 2024 | 4:02 PM
Swiggy సంస్థ మోసం! కోర్టుకి ఈడ్చి ఫైన్ కట్టించిన సామాన్యుడు! కోర్టు కూడా ఆగ్రహం!

ఇప్పుడు అంతా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ హవానే ఎక్కువగా నడుస్తోంది. నిమిషాల వ్యవధిలో ఉన్నచోటకే ఫుడ్ అందించడంతో ఇటీవల కాలంలో ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ సంస్థలకు ఏవిధంగా డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే లక్షలాది మంది ఫుడ్ ఆర్డర్స్ ను పెట్టుకుంటూ తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. పైగా ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో వంట చేసుకునే తీరిక ఎవరికీ లేక అందరూ ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్ ల పైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీటి గిరాకీ పెరగడంతో.. స్విగ్గీ  ఫుడ్ డెలివరీ సంస్థ, అందులో పనిచేసే డెలివరీ పర్సన్స్ చేసే పనులకు కస్టమర్లకు విసుగు తెప్పిస్తున్నాయి. తరుచు ఈ మధ్య స్వీగ్గి సంస్థ, అందులో పనిచేసే వ్యక్తులు చేసిన నిర్వాకాలు ఏదో విధంగా వెలుగులోకి వస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ కస్టమర్ కు కూడా స్విగ్గీ సంస్థ నుంచి ఊహించని షాక్ తగిలింది. దీంతో నష్టం పరిహారం కింద స్విగ్గీ సంస్థ కస్టమర్ కు రూ.5000 వేలు చెల్లించింది. అసలు ఏం జరిగిందంటే..

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీ నుంచి రూ. 187 విలువైన చాక్లెట్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. అయితే స్విగ్గీ అతని ఆర్డర్‌ను డెలివరీ చేయలేదు. కానీ, నివేదికల ప్రకారం.. డెలివరీ ఏజెంట్ ఐస్ క్రీం దుకాణం నుంఛి ఆర్డర్ తీసుకున్నప్పటికీ, దానిని కస్టమర్ కు అందజేయలేదు. అయితే స్విగ్గీ  యాప్ కస్టమర్ కు మాత్రం ఆర్డర్  డెలివరీ అయినట్లు తప్పుగా చూపింది. దీంతో ఆ వ్యక్తి  Swiggy కస్టమర్ కేర్‌తో మాట్లాడాడు. ఇక జరిగిన విషయం మొత్తాన్ని వివరించాడు. అలాగే తన డబ్బులు తిరిగి ఇవ్వమని కూడా అడిగాడు. కానీ, స్విగ్గీ సంస్థ మాత్రం అతని డబ్బలు తిరిగి  ఇవ్వలేదు.

Swiggy

ఇక స్విగ్గీ వైఖరికి ఆగ్రహం చెందిన ఈ విషయాన్ని వినియోగదారుల కమిషన్‌ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.  అయితే స్విగ్గీ మాత్రం..  కస్టమర్, రెస్టారెంట్ మధ్య మధ్యవర్తి మాత్రమేనని తమని తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా.. తమ డెలివరీ ఏజెంట్ చేసిన తప్పుకు తాము బాధ్యత వహించలేమని వాదించింది. కానీ, కోర్టు మాత్రం స్విగ్గీ వాదనలను తిరస్కరించింది. ఆర్డర్ లను డెలివరీ చేయనప్పటికీ తిరిగి చెల్లించడంలో స్విగ్గీ సేవలో లోపం’, ‘అన్యాయమైన వాణిజ్య విధానాలను చూపుతుందని పేర్కొంది.  ఈ క్రమంలోనే ఫిర్యాదుదారు మొదట స్విగ్గీ స్విగ్గీ నుంచి రూ. 10,000, న్యాయపరమైన ఖర్చుల కోసం, రూ. 7,500 నష్టపరిహారం కోసం డిమాండ్ చేశారు. అయితే కోర్టు పరిహారం మొత్తాన్ని అధికంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే రూ. 5,000 చెల్లించాలని స్విగ్గీని ఆదేశించింది. మరి, కస్టమర్ పై స్విగ్గీ చూపించిన వైఖరీ పై కోర్టు నష్టపరిహారం చెల్లించమనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.