పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. రామ నవమి సందర్భంగా చెలరేగిన హింసాకాండ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు గతంలో కోల్ కత్తా హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచుడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ ను సోమవారం విచారించి.. తన తీర్పును వెల్లడించింది.
రామనవమి అల్లర్ల కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గతంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ.. కోల్ కత్త హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. రామనవమి అల్లర్లలో ఎలాంటి పేలుడు ఘటనలు జరగలేదని, రాజకీయ పిటిషన్ ఆధారంగానే హైకోర్టు తీప్పు ఇచ్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టు మెట్లెక్కింది దీదీ ప్రభుత్వం. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది.
ఇక ఈ అల్లర్లలో మందు గుండు సామాగ్రీ వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు విన్నవించారు. కాగా.. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లు, పత్రాలు, స్వాధీనం పరచుకున్న వస్తువులు, సీసీటీవీ ఆధారాలు అన్ని ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పునే అమలు చేస్తూ.. తాజాగా సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ ఏడాది జరిగిన రామనవమి అల్లర్లలో సుమారు 500 మంది ఆందోళనకారులు పాల్గొని.. రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు దగ్గమవ్వగా.. ఇద్దరు మరణించారు. ఎంతో మంది ఈ అల్లర్లలో తీవ్రంగా గాయపడ్డారు.
ఇదికూడా చదవండి: పవన్ కళ్యాణ్ పై కేసు.. విచారణ రేపటికి వాయిదా!