iDreamPost
android-app
ios-app

అలా జరిగే హిందూ వివాహాలు ఇక చెల్లవు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

  • Published May 02, 2024 | 3:28 PM Updated Updated May 02, 2024 | 3:28 PM

Supreme Court: భారతీయ సమాజంలో హిందూ వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది.. పవిత్రమైంది. వివాహ సమయంలో అనాధిగా వస్తున్న ఈ ఆచార వ్యవహారాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: భారతీయ సమాజంలో హిందూ వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది.. పవిత్రమైంది. వివాహ సమయంలో అనాధిగా వస్తున్న ఈ ఆచార వ్యవహారాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

  • Published May 02, 2024 | 3:28 PMUpdated May 02, 2024 | 3:28 PM
అలా జరిగే హిందూ వివాహాలు ఇక చెల్లవు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

భారత దేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో కీలకమైనది. ఇందుకు మూలమైన వివాహ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉంది. కుటుంబ పెద్దలు, చట్ట సమ్మతితో స్త్రీ, పురుషులు ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవించడం.. వారి మధ్య సామాజిక బంధం ఏర్పడే విధానం వివాహం. వివాహం అనేది తమ తమ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో జరుపుతుంటారు. కానీ ఇటీవల వివాహ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది.. అది అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని సంప్రదాయాలు తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా జరుపుకుంటున్నారు. హిందూ వివాహ వ్యవస్థలో మాంగళ్యదారణ, సప్తపది, అరుందతీ నక్షత్రం వంటి సంప్రదాయాలు ఎంతో ముఖ్యం. ఇవి లేకపోతే అసలు పెళ్లి జరిగినట్టే కాదు. తాజాగా వివాహ వ్యవస్థ, ఆచార, సంప్రదాయాలపై సుప్రీం కోర్టులు కీలక తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే..

హిందూ వివాహం అనేది ఓ పవిత్రమైన కార్యక్రమమే తప్ప ఆట పాటలు, విందు వినోదాలు లేదా వాణిజ్య లావాదేవీలు కాదని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హిందూ వివాహం చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వివాహంలో కచ్చితంగా ఆచారాలు, సంప్రదాయాలు, క్రతువులను నిర్వహించాల్సిందే అని పేర్కొంది. అలాంటి ప్రక్రియలను పాటించకుండా జరిగే వివాహం జరిగినా దాన్ని చట్టబద్దంగా చెల్లదని ప్రకటించాల్సి వస్తుందని వెల్లడించింది. జస్టిస్ బీబీ నాగరత్న, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ లతో కూడిన ధర్మాసనం ‘హిందూ ధర్మంలోని వివాహం అనేది గొప్ప సంస్కారం. దానికి ఎంతో గౌరవం, పవిత్రత ఉంది.. భారతీయ సమాజంలో దానికి ఆ హోదా ఇవ్వాల్సిందే’ అని స్పష్టం చేశారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే జంట ఏడడుగులు వేసే సప్తపది లాంటి సంప్రదాయ ఆచారాలను నిర్వహించకపోతే అది హిందూ వివాహం కాదని కోర్టు స్పష్టం చేసింది.

పెళ్లికి ముందు యువతీ యువకులు హిందూ వివాహ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలి.. ఆలోచించుకోవాలి. వివాహం అనేది ఎంత పవిత్రమైనదో తెలుసుకోవాలి. పెళ్లి అనేది కేవలం కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకునే వాణిజ్య లావేదేవి కాదు. ఆడ, మగ మద్య భార్యాభర్తల అనుబంధం కోసం, భవిష్యత్ లో ఏర్పడే ఒక కుటుంబ వ్యవస్థ కోసం నిర్వహించే గొప్ప కార్యక్రమం అని గుర్తుపెట్టుకోవాలని సుప్రీం కోర్టు వ్యాహ్యానించింది. హిందూ పద్దతి ప్రకారం పెళ్లి తంతు నిర్వహించి ఒక్కటైన జంట తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం.. తనకున్న అధికారాలను వినియోగిస్తూ దంపతుల పెళ్లి చెల్లదని ఇటీవల తీర్పు వెలువరించింది.అంతే కాదు ఆ జంట విడాకుల పిటీషన్ డిస్మిస్ చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom