Super Blue Moon: ఆకాశంలో అద్భుతం.. ఆగస్టు 19న ‘సూపర్ బ్లూ మూన్’! ఏ సమయంలో, ఎలా చూడాలంటే?

ఆకాశంలో అద్భుతం.. ఆగస్టు 19న ‘సూపర్ బ్లూ మూన్’! ఏ సమయంలో, ఎలా చూడాలంటే?

Super Blue Moon: విశ్వంలో తరచూ ఏదో ఒక వింత దృశ్యం మనల్ని కనువిందు చేస్తుంది. ఈ ఏడాది కూడా రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Super Blue Moon: విశ్వంలో తరచూ ఏదో ఒక వింత దృశ్యం మనల్ని కనువిందు చేస్తుంది. ఈ ఏడాది కూడా రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భూమికి ఉన్న ఒక్కే ఒక్క సహజ సిద్దమైన ఉపగ్రహం చంద్రుడు. సుమారుడు నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే  జాబిల్లి మానవాళికి నిత్యం ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాక తరచూ వివిధ సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపిస్తూ మనకు కనువిందు చేస్తుంది. ఈ క్రమంలోనే  తన నిండైన రూపంతో పెద్దగా, సాధారణం కంటే మరింత ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్ని సూపర్ బ్లూ మూన్ అని పిలుస్తారు. ఇప్పటికే అనేక సార్లు కనిపించిన ఈ మూన్.. ఈ ఏడాది నాలుగు సార్లు కనువిందు చేయనుంది. తొలి సూపర్ బ్లూ మూన్ మాత్రం ఆగష్టు 19న  ఆవిష్కృతం కానుంది. మరి..ఈ సూపర్ బ్లూ మూన్ లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

విశ్వంలో తరచూ ఏదో ఒక వింత దృశ్యం మనల్ని కనువిందు చేస్తుంది. ఈ ఏడాది కూడా చంద్రుడు సూపర్ బ్లూ మూన్ గా కనిపించనున్నాడు.  అయితే ఈ సారి ఏకంగా నాలుగు సూపర్ మూన్ లు కనిపించనున్నాయి. సూపర్ మూన్ కాస్తా..నాలుగు దశలో బ్లూ మూన్ గా మారనున్నాడు. అయితే తొలి సూపర్ బ్లూ మూన్ ఆగష్టు 19 సోమవారం మధ్యాహ్నం 2.26 గంటల నుంచి కనువిందు చేయనుంది. ఇక నాసా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సూపర్ బ్లూ మూన్ ఏర్పడిన సమయంలో సాధారణ స్థితి కంటే.. ఎక్కువ కాంతిగా,  మరింత పెద్దగా కనిపించనుంది.  చంద్రుడు భూమికి 90 శాతం దగ్గర రావడంతో సూపర్ మూన్ సంభవిస్తుంది.

 ఇక ఈ సూపర్‌మూన్ అనే పదాన్ని 1979లో  ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నోల్లే ఉపయోగించారు. ఫుల్ సూపర్‌మూన్‌లు సంవత్సరంలో ప్రకాశవంతమైన, అతిపెద్ద పౌర్ణమి చంద్రుడిగా ప్రసిద్ధి చెందాయి. ఈ సూపర్ మూన్ సాధారణ చంద్రుని కంటే 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా,  14 శాతం పెద్దదిగా కనిపిస్తుంది. మరోవైపు, బ్లూ మూన్‌లో రెండు రకాలు ఉన్నాయి.  నాలుగు సూపర్ మూన్ ఉన్న సీజన్‌లో మూడవ దానిని కాలానుగుణ బ్లూ మూన్ అంటారు. ఇది ఆగస్టు 19న కనిపించే బ్లూ మూన్ రకానికి చెందినది. ఈ నెలలో వచ్చే సూపర్ మూన్ తరువాత తదుపరివి తదుపరి సెప్టెంబర్, అక్టోబర్‌లలో కనిపించనున్నాయి.

ఆగస్ట్ 19న సోమవారం మధ్యాహ్నం ఈ సూపర్ బ్లూ మూన్ ఏర్పడినప్పటికీ..ప్రాంతాలను బట్టీ  కాస్తా అటుఇటుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ సూపర్‌మూన్ బ్లూ మూన్‌ను ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. ఉత్తర అమెరికాలో, సూపర్ బ్లూ మూన్ ఆగష్టు 19న మధ్యాహ్నం పూర్తి స్థాయి బ్లూ మూన్ కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు మూడు రోజుల పాటు పూర్తిగా కనిపిస్తుంది. ఈ సూపర్ మూన్ ఆగష్టు 18, 19 మరియు 20 తేదీలలో కనిపిస్తుందని నాసా తెలిపింది. ఆసియా, ఆస్ట్రేలియాలో పౌర్ణమి ఆగష్టు 20 ఉదయం కనిపించనుంది. భారతదేశంలో ఆగస్టు 19 రాత్రి  నుంచి ఆగస్ట్ 20 తెల్లవారుజాము వరకు సూపర్ మూన్ ను చూడగలం.

ఇక ఈ సూపర్ బ్లూ మూన్ నార్మల్ గానే కనిపిస్తుంది. అయితే వాయు కాలుష్యం లేని ప్రాంతాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మనకు సూపర్ మూన్ కంటికి కనిపిస్తున్నప్పటికీ.. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ను వినియోగించి..మరింత స్పష్టంగా చూడవచ్చు. మొత్తంగా రాఖీ పర్వదినం రోజు ఈ అద్భుత దృశ్యం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. అయితే కంటికి హానిజరగని విధంగా ఈ సూపర్ మూన్ చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ సూపర్ బ్లూ మూన్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show comments