iDreamPost

పాలు అమ్మే అమ్మాయి.. ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతి!

  • Published Jun 25, 2024 | 6:08 PMUpdated Jun 25, 2024 | 6:27 PM

సాధారణంగా 11 ఏళ్ల వయసులో ఎవరైనా చదువుకుంటూ ఉంటారు. కానీ, ఓ బాలిక మాత్రం చిన్న వయసు నుంచే ఓ వైపు చదువుతూ మరోవైపు పాల వ్యాపారం చేసిన నేడు కోట్ల వ్యాపారానికి అధిపతిగా నిలిచింది. మరి ఆమె విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా 11 ఏళ్ల వయసులో ఎవరైనా చదువుకుంటూ ఉంటారు. కానీ, ఓ బాలిక మాత్రం చిన్న వయసు నుంచే ఓ వైపు చదువుతూ మరోవైపు పాల వ్యాపారం చేసిన నేడు కోట్ల వ్యాపారానికి అధిపతిగా నిలిచింది. మరి ఆమె విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 25, 2024 | 6:08 PMUpdated Jun 25, 2024 | 6:27 PM
పాలు అమ్మే అమ్మాయి.. ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతి!

సక్సెస్..ఇది ఎవరికి ఊరికే రాదు. పైగా దీనికి వయసుతో అసలే సంబంధం ఉండదు. కాస్త బుర్రకు పదును పెట్టి తెలివిగా ఆలోచిస్తే చాలు.. ఎటువంటి వ్యక్తి అయినా అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే ఏదైనా వినూత్నంగా ఆలోచించి కృషి చేస్తే చాలు.. అసాధ్యమైనది కూడా సాధ్యమయ్యేలా చేయవచ్చు. అయితే ఆలోచనలకు, కృషికి, సక్సెస్ కు వయసు అనేది ఎప్పుడు అడ్డు కాదు. అయితే ఇప్పుడు ఇదాంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, పైగా వయసు సంబంధం లేదని కూడా మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. మరెమీ లేదండి. సాధారణంగా పదకొండేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. ఇది ఒక ప్రశ్న అని అనుకోకండి. సహజంగా ఆ వయసులో పిల్లలు స్కూల్ కి వెళ్లడం, రావడం, చదవడం వంటి చేస్తుంటారు. అంతకు మించి వారికి మరి ఏ పని కానీ,ప్రపంచం కానీ ఉండదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ యువతి మాత్రం టీనేజ్ నుంచే చదువుతో పాటు వ్యాపారాన్ని చేసింది. పైగా తన ప్రపంచంలో ఇప్పుడు కోట్ల వ్యాపారానికి అధిపతిగా మారింది. మరి స్కూల్ స్టేజ్ నుంచి వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయిందో ఇప్పుడు ఆమె సక్సెస్ స్టోరి గురించి తెలుసుకుందాం.

సాధారణంగా 11 ఏళ్ల వయసులో ఎవరైనా చదువుకుంటూ ఉంటారు. కానీ, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఆ వయసు నుంచే వ్యాపారం ప్రారంభించింది. అయితే అది కూడా పాల వ్యాపారం. కాగా, తన ఇంట్లో ఉన్న గేదెల ఇచ్చే పాలను తీసుకెళ్లి వ్యాపారులకు ఇచ్చి వచ్చే పని నుంచి ఇప్పుడు ఏకంగా డెయిరీ ఫారం ను నెలకొల్పి రూ. కోట్లు గడిస్తోంది. మరి ఆ అమ్మాయి పేరు శ్రద్దా ధావన్. ఈమె తండ్రి సత్యవాన్ ఒక వికలాంగుడు. దీంతో చిన్న వయసు నుంచే శ్రద్ధ ఓ వైపు చదువుతూ మరోవైపు తండ్రికి తోడుగా వ్యాపారంలో సహాయంగా ఉండేది. ఈక్రమంలోనే.. గేదెల పాలు పట్టడం, సమీపంలోని డెయిరీలకు పాలు సరఫరా చేయడం చేస్తుండేవారు.కానీ ఇప్పుడు రూ. 1 కోటి విలువైన సంస్థను సింగిల్ హ్యాండెడ్‌గా నడుపుతోంది. అయితే శ్రద్ధ ధావన్ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు అనగా 13,14 సంవత్సరాలు ఉన్నప్పుడు తమ గేదెల నుంచి పాల వ్యాపారం ప్రారంభించింది. పైగా ఆ వయసులోనే గేదెలకు పాలు పితికే కళ నుంచి వ్యాపారులతో తెలివిగా చర్చల వరకు అన్ని విషయాలను నేర్చుకుంది.

The girl who sells milk 02

అయితే ఈ చమత్కారంతోనే శ్రద్ధా గేదెల పాలు వ్యాపారులకు విక్రయించే స్థితి నుంచి పాడి పరిశ్రమను స్థాపించే స్థాయికి ఎదిగింది. అయితే ఎక్కడ కూడా శ్రద్ద రుణాలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఆమె తెలివిగా ఎన్నో లాభాలను పొందింది. పైగా 2017 నాటికి, ఆమె పొలంలో 45 గేదెలు ఉన్నాయి. అలా క్రమం క్రమం శ్రద్ద పాల నాణ్యతను పెంపొందించడంపై దృష్టి సారించింది. అయితే అక్కడితో ఆగిపోకుండా.. శ్రద్ధా తన వ్యాపార ప్రయత్నాలను వైవిధ్యంగా మార్చుకుంది. ఆమె వర్మీకంపోస్టింగ్‌లోకి ప్రవేశించింది. దీంతో నెలకు గణనీయమైన 30,000 కిలోల వర్మీకంపోస్ట్‌ను ఉత్పత్తి చేసింది. ఇకపోతే సీఎస్ ఆగ్రో ఆర్గానిక్స్ బ్రాండ్ కింద విక్రయించింది. అలాగే ఆమె ఒక బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, దానిలో గేదెల వ్యర్థాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసి, జీరో వేస్టేజ్ వ్యాపారంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది.

అంతేకాకుండా.. శ్రద్ద ఆమె ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఆమె అడుగుజాడల్లో అనుసరించడానికి ఇతరులతో ఆమె తన జ్ఞానం, అనుభవాన్ని పంచుకుంటుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రద్ధా ధావన్ వయసు 24 సంవత్సరాలు. తను భౌతికశాస్త్రంలో ఎంఎస్సీ పట్టా పొందింది. అయితే ఆమె మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా, నిఘోజ్ గ్రామంలో శ్రద్ధా ఫామ్‌కు అధిపతి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో శ్రద్ద డైరీ, వర్మీకంపోస్ట్, శిక్షణ వ్యాపారాలు సమష్టిగా రూ. 1 కోటి ఆదాయాన్ని ఆర్జించాయి.ప్రస్తుతం ఆమె పొలంలో 80 గేదెలను ఉంచగలగిన రెండంతస్తుల షేడ్ ను రూపొందించి, అక్కడి నుంచి డెయిరీని నడుపుతోంది. ఇకపోతే అతి చిన్న వయసు నుంచే వ్యాపారంలో నెగ్గుకు వస్తూ..నేడు ఓ సంస్థకు అధిపతి కావడం నిజంగా గర్వ కారణం. పైగా శ్రద్దా ధావన్ సక్సెస్ స్టోరీ ప్రతిఒక్కరికి స్పూర్తిదాయకం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి