iDreamPost
android-app
ios-app

ప్రభుత్వం కొత్త నిర్ణయం! ఇకపై ఆ స్పీడ్ దాటితే డ్రైవర్ జైలుకే!

  • Published Jul 30, 2024 | 3:35 PM Updated Updated Jul 30, 2024 | 3:35 PM

Strict Action Drivers Exceed the Speed: ఇటీవల దేశంలో పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.

Strict Action Drivers Exceed the Speed: ఇటీవల దేశంలో పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రభుత్వం కొత్త నిర్ణయం! ఇకపై ఆ స్పీడ్ దాటితే డ్రైవర్ జైలుకే!

దేశంలో ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. వాహనదారులను కంట్రోల్ చేయడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా చలానాలు విధిస్తున్నారు. అయినా కూడా కొంతమంది డ్రైవర్లలో మార్పులు రావడం లేదు. డ్రైవర్లు చేసే తప్పిదాలకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ ప్రమాదాలన అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధన అమలు చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి డ్రైవర్ల వేగ పరిమితిపై దృష్టి సారించే ప్రయత్నంలో కర్ణాటక పోలీసులు ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను అరికట్టడానికి డ్రైవర్ల వేగ పరిమితిపై దృష్టి సారించే ప్రయత్నంలో, కర్ణాటక పోలీసులు ఆగస్టు 1 నుండి రాష్ట్రంలోని ఏ రహదారిలోనైనా 130 కిలో మీటర్ల వేగ పరిమితిని మించిన డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తారు. ఇటీవల కర్ణాటకలో 90 శాతం వాహనాలు వేగంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని శిక్షణ, ట్రాఫిక్, రోడ్డు భద్రత అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆలోక్ కుమార్ తెలిపారు. దేశంలో అత్యధింకంగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి చండీగఢ, కర్ణాటకలో అని పోలీసులు చెబుతున్నారు.

ఆగస్టు 1 నుంచి కర్ణాటకలో ఎక్కడైనా డ్రైవర్లు 130 కిలో మీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో డ్రైవ్ చేస్తే వారి వాహనాలపై ర్యాష్ అండ్ డెంజరస్ డ్రైవింగ్ కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆలోక్ కుమార్ తెలిపారు. జులై 25 నాటి డేటాను ఊటంకిస్తూ.. బెంగుళూరు – మైసూర్ హైవే పై 155 మంది వాహనదారులు గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడిపారని ఆయన అన్నారు. ఇకపై ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే డ్రైవర్లకు కఠిన శిక్ష తప్పదు అని అన్నారు.ఎక్కువ వేగంతో నడిచే వాహనం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటుందని కర్ణాటక పోలీసులు ప్రకటించారు.