iDreamPost
android-app
ios-app

వందే భారత్ రైలుపై ఆగని రాళ్లదాడులు..అద్దాలు ధ్వంసం!

  • Published Jun 12, 2024 | 6:38 PM Updated Updated Jun 12, 2024 | 6:38 PM

Vande Bharat Train: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులో తెచ్చింది. కానీ కొందమంది విద్రోహక శక్తులు, ఆకతాయిలు ఈ రైలుపై రాళ్ల దాడులు చేస్తున్నారు.

Vande Bharat Train: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులో తెచ్చింది. కానీ కొందమంది విద్రోహక శక్తులు, ఆకతాయిలు ఈ రైలుపై రాళ్ల దాడులు చేస్తున్నారు.

వందే భారత్ రైలుపై ఆగని రాళ్లదాడులు..అద్దాలు ధ్వంసం!

రైలు టికెట్ ధర తక్కువ.. ఎన్నో సౌకర్యాలు కలిగి ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసేవారు రైలు ప్రయాణాలు చేయడానికే సుముఖత చూపిస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఇలా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో రైలు ప్రయాణాలు చేస్తుంటారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది వందే భారత్ ఎక్స్ ప్రెస్. అయితే కొంతమంది ఆకతాయిలు ఇటీవల వందేభారత్ పై తరుచూ రాళ్లదాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి వందేభారత్ పై రాళ్ల దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే..

వందే భారత్ రైలు పై కొంతమంది రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో ఒక కోచ్ కిటీకీ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఒకేసారి పెద్ద శబ్ధంతో కిటీకీ కి రాళ్లు తగలడంతో కోచ్ లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటన పంజామ్ లో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అమృత్ సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పై ఫగ్వారా ప్రాంతాంలో కొంతమంది ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దీంతో C3 కోచ్ లోని రెండు విండ్ గ్లాసులకు పగుళ్లు వచ్చాయి. పెద్ద శబ్ధం రావడంతో కిటీకీ పక్కన కూర్చునున్న వారు ఒక్కసారిగా హడలిపోయారు. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ సిబ్బంది వెంటనే కోచ్ వద్దకు చేరుకున్నారు. రాళ్ల దాడిలో ధ్వంసమైన కిటికీల అద్దాలు పరిశీలించారు. కొంతమంది ఆకతాయిలు ఈ రాళ్లు విసిరినట్లు ప్రయాణికులు ఆరోపించారుర. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వందే భారత్ రైలు పై రాళ్ల దాడి జరగడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో పలు చోట్ల వందే భారత్ రైల్ పై రాళ్ల దాడులు జరిగిన విషయం తెలిసిందే. రైల్వే పోలీసులు ఈ విషయంలో అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నా ఆకతాయిలు పట్టించుకోవడం లేదు.