iDreamPost
android-app
ios-app

శ్రీరామ ‘శోభాయాత్ర’పై రాళ్ల దాడి.. ఉద్రిక్తత!

  • Published Jan 22, 2024 | 7:57 AM Updated Updated Jan 22, 2024 | 8:22 AM

నేడు అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మార్మోగుగున్నాయి.

నేడు అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మార్మోగుగున్నాయి.

శ్రీరామ ‘శోభాయాత్ర’పై రాళ్ల దాడి.. ఉద్రిక్తత!

దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా రామ నామం జపిస్తున్నారు. శతాబ్దాల పోరాటం.. ఎంతోమంది హిందువుల త్యాగఫలం.. శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే రోజు రానే వచ్చింది. లక్షల మంది భక్తుల చూపు ఇప్పుడు అయోధ్యపైనే ఉంది. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, అనంత భక్తిభావనతో ఎదురుచూస్తున్నారు. జనవరి 22, సోమవారం అయోధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం కానుంది.. నేడు బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖేరాలు పట్టణంలో శ్రీరామ శోభా యాత్ర సందర్బంగా కొంతమంది అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలో నలుమూలలా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో శ్రీరామ శోభా యాత్ర నిర్వహించారు భక్తులు. ఈ క్రమంలోనే గుజరాత్ లోని మోహసానా జిల్లాలో ఖేరాలు పట్టణంలో శ్రీరామ శోభా యాత్రం నిర్వహంచారు.. ఈ సందర్భంగా కొంతమంది అల్లరి మూక అక్కడికి చేరుకొని రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శోభా యాత్రకు పహారా కాస్తున్న పోలీసులు మూడు భాష్పవాయువు షెల్స్ ను అల్లరి మూకలపై ప్రయోగించినట్లు ఐజీ వీరేంద్ర సింగ్ అన్నారు. ఇలాంటి దాడులకు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.

Stone attack on Sri Rama's Shobhayatra

అల్లరి మూకల దాడి తర్వాత సంఘటనా స్థలంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి రాళ్లు రువ్విన ఘటనతో సంబంధం ఉన్న అనుమానితులైన 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ రాళ్ల దాడిలో ఎవరికీ పెద్ద ప్రమాదం జరగలేదని ఐజీ వెల్లడించారు. శోభా యాత్ర తిరిగి ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, ఆ ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12.29 కి అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది.. ఇప్పటికే ఈ వేడుకకు ప్రముఖులు, భక్తులు చేరుకున్నారు.