P Krishna
Ration Card Holders: ఇటీవల దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలపై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ ధర తగ్గింపు పై కీలక నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం
Ration Card Holders: ఇటీవల దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలపై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ ధర తగ్గింపు పై కీలక నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం
P Krishna
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు ఎన్నో రకాల వాగ్దానాలు చేస్తుంటారు పోటీలో ఉన్న అభ్యర్థులు. ఓటర్లు మాత్రం పార్టీలు కాదు.. అభివృద్ది చేసిన వారికే పట్టం కడుతున్నారు. కొన్నిసార్లు ఫలితాలు అనూహ్యంగా మారుతుంటాయి. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీనీ గద్దె దింపి కొత్త పార్టీలకు పట్టం కడుతున్నారు. అందుకే ఓటర్ల నాడి ఏ రాజకీయ నాయకుడు పట్టుకోలేరని అంటారు. ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు తమ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే పనిలో ఉంటుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే గ్యాస్ వినియోగ దారులకు అదిరిపోయే వార్త చెప్పింది ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే..
గత ఏడాది చివరల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు రూ.450 కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మొత్తానికి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇటీవల పేదలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న వాగ్ధానం ఏమైనట్లు? అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో తాము ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నట్లు ప్రకటించింది అధికార ప్రభుత్వం. అర్హులైన నిరుపేద కుటుంబాలకు రూ.450 కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం భజన్ లాల్ శర్మ అసెంబ్లీలో ప్రకటించారు. రాజస్థాన్ అప్రాప్రియేషన్ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్ 2025-25’ పై నిన్న అసెంబ్లీలో చర్చజరిగిన సందర్భంగా ఈ విషయాన్ని సీఎం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే పనిలో ఉన్నామని.. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రూ.450 కు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పొందే వారి పరిధిని విస్తరించే పనిలో ఉన్నట్లు సీఎం భనన్ లాల్ తెలిపారు. గతంలో ఉజ్వల యోజన, బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ ధరకు సిలిండర్లు లభించేవి.. ఇప్పుడు ఈ పథకాన్ని రేషన్ కార్డు ఉన్న అన్ని కుటుంబాలకు వర్తింపజేసేలా చేస్తున్నామని అన్నారు. ప్రతి పేద కుటుంబం రూ.450 కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ప్రయోజనం చేకూరేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.