iDreamPost
android-app
ios-app

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి.. వరుడు కావాలంటూ ప్రకటన..

తమ కూతురికి వరుడు కావాలంటూ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లో, న్యూస్ పేపర్స్ లో ప్రకటన ఇవ్వడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ విచిత్రంగా 30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి చేయడానికి సిద్ధమైందో కుటుంబం. వరుడు కావాలంటూ ప్రకటన కూడా ఇచ్చింది.

తమ కూతురికి వరుడు కావాలంటూ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లో, న్యూస్ పేపర్స్ లో ప్రకటన ఇవ్వడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ విచిత్రంగా 30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి చేయడానికి సిద్ధమైందో కుటుంబం. వరుడు కావాలంటూ ప్రకటన కూడా ఇచ్చింది.

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి.. వరుడు కావాలంటూ ప్రకటన..

సాధారణంగా బతికున్న వారికే పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే ఈ ఊరిలో మాత్రం చనిపోయిన వారికి పెళ్లిళ్లు చేస్తారు. ఏంటి షాకయ్యారా? మరే ఇదే నిజం. అక్కడ ఇదే కల్చర్ అంట. ఎప్పుడో చనిపోయిన కూతుర్లకు పెళ్లి చేస్తారు. దానికోసం వరుడు కావాలని ప్రకటన ఇస్తారు. తాజాగా ఓ కుటుంబం చనిపోయిన తమ కూతురికి వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. కర్ణాటకలోని తుళునాడులో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అక్కడ ప్రజలు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చనిపోయిన తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. తుళు మాసం వచ్చిందంటే ప్రత్యేకించి మరీ ఈ వివాహాలు జరిపిస్తారు. తుళు మాసంలో పెళ్లిళ్లు తప్ప మరే ఇతర శుభకార్యాలను నిర్వహించరు.

ఈ క్రమంలో ఓ కుటుంబం చనిపోయిన తమ కూతురు పెళ్లి కోసం ఒక ప్రకటన ఇచ్చింది. ‘బంగేరా గోత్రం, కులూల్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి వరుడు కావాలి. అమ్మాయి 30 ఏళ్ల క్రితమే చనిపోయింది. అయితే అబ్బాయి 30 ఏళ్ల కిందట చనిపోయి ఉండాలి. మా కులానికి చెందిన వాడు, వేరే గోత్రం వాడు అయి ఉండాలి. 30 ఏళ్ల క్రితం చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ప్రేతాత్మ పెళ్లి చేయడానికి ఇష్టమైతే సంప్రదించండి’ అంటూ ఫోన్ నంబర్ తో ఒక ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన వైరల్ అవ్వడంతో 50 మంది స్పందించారని ప్రకటన ఇచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ఈ ప్రేతాత్మ వివాహా తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు.

ఈ వివాహం చేయడానికి ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని.. సరైన సంబంధం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ పెళ్లిని బతికున్న వారికి ఎలా చేస్తారో అలానే చేస్తారు. వధువు, వరుడి బొమ్మలను పీటల మీద కూర్చోబెట్టి.. వాటికి పెళ్లి బట్టలు ధరిస్తారు. గ్రాండ్ గా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపిస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారో అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని ఇలా చేస్తారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చనిపోయిన బాధలోంచి బయటకు వచ్చి సంతోషంగా గడపడం కోసం ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. తుళులో ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మరి చనిపోయిన పిల్లలకు పెళ్లిళ్లు జరిపిస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి