Spicejet Lady Crew Member Slaps CISF Jawan: CISF జవాన్‌పై దాడి చేసిన స్పైస్ జెట్ క్రూ మెంబర్! ఎందుకంటే?

CISF జవాన్‌పై దాడి చేసిన స్పైస్ జెట్ క్రూ మెంబర్! ఎందుకంటే?

Spicejet Female Crew Member Slapped CISF Jawan In Jaipur Airport: ఈ మధ్య విమానాశ్రయాల్లో ప్రయాణికుల మీద ఎయిర్ పోర్టు సిబ్బందులు, ఎయిర్ పోర్ట్ సిబ్బందుల మీద ప్రయాణికులు దాడి చేయడాలు ఎక్కువైపోయాయి. ఆ మధ్య కంగనా రనౌత్ మీద సీఐఎస్ఎఫ్ లేడీ జవాన్ దాడి చేయగా.. తాజాగా సీఐఎస్ఎఫ్ జవాన్ మీద స్పైస్ జెట్ క్రూ మెంబర్ దాడికి దిగింది.

Spicejet Female Crew Member Slapped CISF Jawan In Jaipur Airport: ఈ మధ్య విమానాశ్రయాల్లో ప్రయాణికుల మీద ఎయిర్ పోర్టు సిబ్బందులు, ఎయిర్ పోర్ట్ సిబ్బందుల మీద ప్రయాణికులు దాడి చేయడాలు ఎక్కువైపోయాయి. ఆ మధ్య కంగనా రనౌత్ మీద సీఐఎస్ఎఫ్ లేడీ జవాన్ దాడి చేయగా.. తాజాగా సీఐఎస్ఎఫ్ జవాన్ మీద స్పైస్ జెట్ క్రూ మెంబర్ దాడికి దిగింది.

ఉద్యోగులు ఈ మధ్య కాలంలో సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టులో పని చేసే ఉద్యోగులు ప్రయాణికుల మీద చేయి చేసుకుంటున్నారు. ఆ మధ్య కంగనా రనౌత్ మీద ఎయిర్ పోర్టులో పని చేసే సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్ చేయి చేసుకుని వార్తల్లో నిలిచింది. తాజాగా మరి స్పైస్ జెట్ క్రూ మెంబర్ సీఐఎస్ఎఫ్ జవాన్ పై దాడికి దిగింది. జైపూర్ విమానాశ్రయంలోని స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ కి చెందిన మహిళా సిబ్బందిని ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐఎస్ఎఫ్ జవాన్ తో జరిగిన గొడవ కారణంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ రాణి అనే ఎయిర్ లైన్స్  సిబ్బంది ఎయిర్ పోర్టులోకి భద్రతా ప్రమాణాలను పాటించకుండా నేరుగా ప్రవేశించే ప్రయత్నం చేసిందన్న కారణంతో అక్కడున్న సీఐఎస్ఎఫ్ జవాన్ ఆమెను అడ్డుకున్నారు.

అయితే తనను అడ్డుకున్నందుకు తన మీద అనురాధ రాణి అనుచిత వ్యాఖ్యలు చేసిందని.. వేధించే ప్రయత్నం చేసిందని జవాన్ ఆరోపించారు. తనపై చేయి కూడా చేసుకుందని అన్నారు. అయితే గొడవతో ఎయిర్ పోర్ట్ పోలీసులు రంగంలోకి దిగారు. జవాన్, ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కాగా ఎయిర్ పోర్ట్ పోలీసులు ఎయిర్ లైన్స్ సిబ్బంది అనురాధ రాణిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు దీని మీద విచారణ చేపట్టారు. కాగా గత నెలలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కి చండీగఢ్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో పని చేస్తున్న లేడీ జవాన్ కంగనా రనౌత్ పై చేయి చేసుకుంది. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన కంగనా రనౌత్ కి అడ్డుపడడమే కాకుండా ఆమెతో గొడవకు దిగింది.

సెక్యూరిటీ చెక్ తర్వాత కంగనా రనౌత్ ముందుకు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్ కుల్విందర్ కౌర్ కంగనాను కొట్టింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనతో కంగనా రనౌత్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆమె ఫిర్యాదు చేయడంతో ఆ మహిళా జవాన్ ను సస్పెండ్ చేశారు. విమానాశ్రయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇప్పుడేమీ తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు జరిగాయి. గత ఏడాది ఆగస్టు నెలలో ఒక మహిళా ప్రయాణికురాలు తన ఫ్రస్ట్రేషన్ ని మహిళా సిబ్బందిపై తీర్చుకుంది. ఆ ప్రయాణికురాలు ఆలస్యంగా రావడంలో ముంబై విమానం ఎక్కనివ్వలేదని కౌంటర్ లో ఉన్న సిబ్బందిపై చేయి చేసుకుంది. అయితే ఆ మహిళా ప్రయాణికురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా వరుసగా విమానాశ్రయాల్లో సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేయడం, ప్రయాణికుల మీద సిబ్బంది దాడి చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.

Show comments