Keerthi
సాధారణంగా ఒకే తల్లి కడుపున వివిధ రకాలుగా కవలలు జన్మిస్తుంటారు. కాగా, అలాంటి వారిలో మనకు బాగా తెలిసినవారు వీణా వాణిలు ఒకరు. కానీ, వీరిలానే దేశంలో మరో అవిభక్త కవలలు కూడా ఉన్నారు. వారు వీణ, వాణిలకు కాస్త భిన్నంగా ఉంటాారు. అసలు వీరిని చూస్తే ఎలా జీవనం సాగిస్తున్నరనే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, దేవుడి పెట్టిన శాపాన్ని, వారు వరంగా మార్చుకొని తమ సత్తా చాటుతున్నారు.
సాధారణంగా ఒకే తల్లి కడుపున వివిధ రకాలుగా కవలలు జన్మిస్తుంటారు. కాగా, అలాంటి వారిలో మనకు బాగా తెలిసినవారు వీణా వాణిలు ఒకరు. కానీ, వీరిలానే దేశంలో మరో అవిభక్త కవలలు కూడా ఉన్నారు. వారు వీణ, వాణిలకు కాస్త భిన్నంగా ఉంటాారు. అసలు వీరిని చూస్తే ఎలా జీవనం సాగిస్తున్నరనే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, దేవుడి పెట్టిన శాపాన్ని, వారు వరంగా మార్చుకొని తమ సత్తా చాటుతున్నారు.
Keerthi
సాధారణంగా ఒకే తల్లి కడుపున ఇద్దరు కవలలు జన్మించడం సహాజం. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది కవలలు వివిధ రకాలుగా పుట్టినవారు ఉన్నారు. అయితే వారిలో కొంతమంది రెండు గుండెలు, రెండు మెదడులు, రెండు చేతులతో ఇలా శరీరం వేరు వేరుగా ఉన్న.. అవయవాలు అతుక్కొని పుడుతుంటారు. అలాంటి వారిలో ఒకరైన వీణా వాణిలు మనకు బాగా తెలుసు. వారిద్దరికి శరీరాలు వేరైనా తల భాగం లో అతుక్కొని జన్మించారు. ఈ క్రమంలోనే.. వారిని వేరు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న అది ఎంత వరకు సాధ్యం కావడం లేదు. అయితే అచ్చం ఈ వీణా వాణిలాగే.. పంజాబ్ కు చెందిన ఇద్దరూ అవిభక్త కవలలు ఉన్నారు. కానీ, వీరిని చూస్తే అసలు ఎలా జీవనం కొనసాగిస్తున్నారనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే..వీరు వీణా వాణిలాగా కాకుండా అందుకు కాస్త భిన్నంగా పుట్టారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అవిభక్త కవలలైనా వీణా వాణిలాగా.. పంజాబ్ కు చెందిన ఓ ఇద్దరు యువకులు ఒకే తల్లి కడుపున పుట్టారు. పైగా అందరిలాగానే రెండు గుండెలు, రెండు మెదడులు, రెండు చేతులు ఉన్నాయి. కానీ కాళ్లు మాత్రం రెండే. వారే సోహ్నా-మోహనా సింగ్ ఇద్దరు కవలలు. వీరు 2003, జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపలానీ హాస్పిటల్‌లో జన్మించారు. కానీ, చాలా అరుదైన పరిస్థితిలో జన్మించడంతో.. వీరి శరీరంలోని పై భాగం అంతా విడి విడిగానే ఉన్నా, తుంటి నుంచి దిగువ భాగం మాత్రం కలిసిపోయింది. అయితే వీరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉందని అప్పటిలో వైద్యులు తేల్చారు. కనుక వీరిద్దరూ 22 ఏళ్లగా అలా అతుకొనే జీవనం కొనసాగిస్తున్నారు.
కాగా, ఈ యువకుల కుటుంబ విషయానికొస్తే.. అతని తండ్రి సుర్జిత్ కుమార్ ఒక టాక్సీ డ్రైవర్. అయితే అప్పటికే అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ కవలలను పోషించే స్థోమత లేక వారి రెండు నెలల వయసులోనే ఢిల్లీలోని AIMSలో విడిచిపెట్టారు. ఆ తర్వాత వారిద్దరిని అమృత్‌సర్‌లోని ఓ షెల్టర్‌హోమ్ దత్తత తీసుకుంది. అలాగే, ఇందర్‌జిత్ కౌర్ అనే డాక్టర్ ఈ కవలలకు సోహ్నా సింగ్, మోహనా సింగ్ అంటూ నామకరణం చేశారు. దీంతో పాటు వారి ఫస్ట్ బర్త్‌డే ను కూడా ఘనంగా జరిపించారు. అయితే ప్రస్తుతం ఈ కవలలు ఐటీఐ డిప్లొమా చేసి పంజాబ్ స్టేట్ పవర్ లో ఎలక్ట్రీషియన్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఇక ఇద్దరివీ విలక్షణమైన వ్యక్తిత్వాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం విశేషం. అయితే వీరిలో సోహ్నా డామినేటింగ్‌గా ఉంటే.. మోహనా సింగ్ మౌనంగా సెన్సిటివ్‌గా ఉంటాడు. పైగా గతంలో ఎన్నికల సంఘం ఇద్దరికీ వేర్వేరు ఓటర్ కార్డులను జారీ చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ అమృత్‌సర్‌లోని మనవాల్‌లో గత ఎన్నికలలో ఓటు కూడా వేశారు. మరి, అవిభక్త కవలలుగా ఉండే వీరు పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.