iDreamPost
android-app
ios-app

రాజ్యాంగం కొత్త కాపీల్లో సోషలిస్టు, సెక్యూలర్ పదాలు మిస్సింగ్!

  • Author Soma Sekhar Published - 02:22 PM, Wed - 20 September 23
  • Author Soma Sekhar Published - 02:22 PM, Wed - 20 September 23
రాజ్యాంగం కొత్త కాపీల్లో సోషలిస్టు, సెక్యూలర్ పదాలు మిస్సింగ్!

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశమైంది. దీనితో పాటుగా పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త భవనంలో మంగళవారం అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఇక ఈ సమావేశంలో చారిత్రాత్మక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త పార్లమెంట్ లోకి వచ్చిన సభ్యులకు నూతన రాజ్యాంగ కాపీలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొత్త రాజ్యాంగ కాపీల్లో సామ్యవాద, లౌకికవాద అనే పదాలు కనిపించలేదు. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

నూతన పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశాల్లో పార్లమెంట్ సభ్యులకు నూతన రాజ్యాంగ కాపీలను అందజేశారు. వారికి ఇచ్చిన కొత్త రాజ్యాంగ కాపీల్లో సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలు పీఠికలో కనిపంచకపోవడంతో.. తీవ్ర దూమారం రేగుతోంది. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కాగా.. సెంట్రల్ విస్టాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కొత్తగా ముద్రించిన రాజ్యాంగ కాపీలను మాకు అందజేశారని, కానీ వాటి పీఠికలో సెక్యులర్, సోషలిస్టు పదాలు లేవని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌందరీ ఆరోపించారు.

42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చుకున్నామని, కానీ ఇప్పుడా పదాలు ఇందులో లేవని అధీర్ రంజన్ చౌదరీ ఆందోళన వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందని ఆయన ఆరోపించారు. ఇక ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావల్ స్పందించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పదాలు అందులో లేవని, ఆ తర్వాత జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చారని ఆయన గుర్తుచేశారు. కానీ సరైన సమాధానం మాత్రం ఆయన నుంచి రాలేదు. అయితే రాజ్యాంగం హిందీ కాపీలలో మాత్రం సాధారణంగా ఉండటం గమనార్హం. ఈ తప్పు ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ పదాలు మిస్సవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.