అమర్‌ జవాన్‌ భార్యని వదలని సోషల్‌ మీడియా భూతం.. అసభ్యకరంగా కామెంట్స్‌

Captain Anshuman Singh: సోషల్‌ మీడియా వేదికగా ముఖం చూపించకుండా విమర్శలు చేస్తూ.. శునకానందం పొందే రాక్షసులు.. తాజాగా అమర్‌ జవాన్‌ భార్యపై దాడికి దిగారు. అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ.. రాక్షసానందం పొందారు. ఆ వివరాలు..

Captain Anshuman Singh: సోషల్‌ మీడియా వేదికగా ముఖం చూపించకుండా విమర్శలు చేస్తూ.. శునకానందం పొందే రాక్షసులు.. తాజాగా అమర్‌ జవాన్‌ భార్యపై దాడికి దిగారు. అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ.. రాక్షసానందం పొందారు. ఆ వివరాలు..

నేటి సమాజాన్ని సోషల్‌ మీడియా నడిపిస్తుంది అని చెప్పవచ్చు. దీని వల్ల మంచి ఎంత జరుగుతుందో.. అంతకు పదింతలు చెడు కూడా జరుగుతుంది. సోషల్‌ మీడియా వల్ల ఓవర్‌ నైట్‌లో సెలబ్రిటీలుగా మారిన వారు ఉండగా.. సోషల్‌ మీడియా వేదికగా సాగే ట్రోలింగ్‌ను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలను కూడా చూస్తున్నాం. ఇక గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియోపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. తండ్రీకూతుళ్ల బంధం మీద కొందరు పనికిమాలిన వ్యక్తులు.. అసభ్యకర, జుగుప్సకరమైన కామెంట్స్‌ చేస్తూ.. రాక్షసానందాన్ని పొందారు. దీనిపై విమర్శులు వెల్లువెత్తుతుండాగానే.. మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అమర్‌ జవాన్‌ భార్యపై సోషల్‌ మీడియా భూతం విరుచుకుపడింది. భర్త చనిపోయిన బాధలో ఉన్న ఆమె మీద సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ.. రాక్షసానందం పొందుతున్నారు కొందరు. ఆ వివరాలు..

నాలుగు రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దేశ రక్షణలో ధైర్య సాహసాలు చూపించిన సైనిక, పారామిలిటరీ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో కెప్టెన్‌ అంశుమాన్‌ సింగ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ వీర జవాన్‌.. సైన్యంలో పని చేస్తూ.. గతేడాది ప్రాణాలు కోల్పోయాడు. మరణానికి ముందు అతడు ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ డాక్టర్‌, పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన 26వ బెటాలియన్‌లో విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో గతేడాది విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలో కోల్పోయాడు. అతడు చేసిన త్యాగానికి గుర్తుగా కేంద్రం అంశుమాన్‌  సింగ్‌కు కీర్తి చక్ర పురస్కారం ప్రకటించగా.. అతడి భార్య స్మృతి సింగ్‌ ఆ అవార్డును అందుకుంది. ఈ క్రమంలో ఆమె ఫోటోతో పాటు.. వారి ప్రేమ కథ కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇంత వరకు బాగానే ఉంది.

కానీ ఇక్కడే సోషల్‌ మీడియా రాక్షసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న స్మృతిని చూసి కన్నీరు పెట్టుకోవాల్సింది పోయి.. ఆమె మీద అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ రాక్షసానందం పొందారు. సోషల్‌ మీడియా వేదికగా స్మృతిపై అనుచిత, అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ వికృత బుద్ధిని చాటుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించారు అనే కనీస మర్యాద, గౌరవం కూడా లేకుండా.. అసభ్యకర కామెంట్స్‌ చేశారు.

స్మృతి చాలా అందంగా ఉందని.. ఆమె ఏడుస్తుంటే.. తమ గుండె బద్దలవుతుంది అంటూ బ్రోకెన్‌ హార్ట్‌ ఎమోజీలు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ఈ ఘటనపై జాతీయ మహిళ కమిషన్‌ స్పందించింది. ఈ నేపథ్యంలో అహ్మద్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసింది. అతడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు నెటిజనులు.

Show comments