iDreamPost
android-app
ios-app

వేశ్య అని తిడుతున్నారు అంటూ హీరోయిన్ ఆవేదన!

  • Published Mar 23, 2024 | 8:28 PM Updated Updated Mar 23, 2024 | 8:28 PM

Heroine Emotional On Trolling: సోషల్ మీడియాలో వచ్చాక ట్రోలింగ్ అనేది ఎక్కువైపోయింది. ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తారో కూడా తెలియడం లేదు. ఒక్కరైతే ఏ కారణం లేకుండా స్టార్స్ ట్రోల్ చేస్తుంటారు. అలాగే ఒక హీరోయిన్ ఇప్పుడు ట్రోలింగ్ గురించి ఆవేదన వ్యక్తం చేసింది.

Heroine Emotional On Trolling: సోషల్ మీడియాలో వచ్చాక ట్రోలింగ్ అనేది ఎక్కువైపోయింది. ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తారో కూడా తెలియడం లేదు. ఒక్కరైతే ఏ కారణం లేకుండా స్టార్స్ ట్రోల్ చేస్తుంటారు. అలాగే ఒక హీరోయిన్ ఇప్పుడు ట్రోలింగ్ గురించి ఆవేదన వ్యక్తం చేసింది.

  • Published Mar 23, 2024 | 8:28 PMUpdated Mar 23, 2024 | 8:28 PM
వేశ్య అని తిడుతున్నారు అంటూ హీరోయిన్ ఆవేదన!

సినిమా అనేది రంగుల ప్రపంచం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత ఎత్తుకు లేపుతారో.. అంతే పాతాళానికి కూడా తోసేస్తుంటారు. యాక్టర్స్, క్రియేటివ్ పీపుల్ అంతా అభిమానం అనే మాయలో మునిగిపోయి ఉంటారు. ఈరోజు నువ్వు రైజింగ్ లో ఉంటా నెత్తిన పెట్టుకుంటారు. అటు ఇటూ అయితే సోదిలో కూడా ఉండరు. ఇలాంటి చాలానే సందర్భాలు, ఉదాహరణలు ఇండస్ట్రీలో ఉన్నాయి. అలాగే ఎంత కష్టపడ్డా కూడా కొన్నిసార్లు ట్రోలింగ్, అవమానాలు తప్పవు. ముఖ్యంగా హీరోయిన్స్ మీద దారుణగా ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఒక హీరోయిన్ తనను వేశ్య అని తిడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

సాధారణంగా ప్రయోగాలు, కొన్ని వర్గాలకు నచ్చని చిత్రాలు చేసే యాక్టర్స్ పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. అలాంటి సినిమాలు చేసింది హీరోయిన్స్ అయినా కూడా పిచ్చి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అలాగే ఇప్పుడు అదా శర్మ కూడా ట్రోలింగ్ కి గురవుతోంది. తనపై జరిగిన ట్రోలింగ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. కొందరైతే తనని వేశ్య అని తిడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. విషయం ఏంటంటే.. అదా శర్మ ఇటీవల బస్తర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

Adah Sharma

బస్తర్ సినిమా పోస్టర్ లో రగ్డ్ లుక్ లో చేతిలో గన్ పట్టుకుని అదా శర్మ ఉంది. ఆ మూవీలో ఐపీఎస్ అధికారిగా అదా శర్మ నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ముందు వరకు అదా శర్మని ట్రోల్ చేశారు. అసలు సినిమా ఏంటో కూడా తెలియకుండా తిట్టారంటూ ఆమె వాపోయింది. అయితే ఆడియన్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. ఎలాగైతే ఆడియన్స్, నెటిజన్స్ వారికి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారో.. నటులకు కూడా తమకు ఇష్టమొచ్చిన సినిమాలు చేసుకునే హక్కు ఉంది అంటూ అదా శర్మ కౌంటర్ ఇచ్చింది. కొందరైతే తాను ఏ పోస్ట్ పెట్టినా.. ఏ ఫొటో పెట్టినా కామెంట్స్ లో ఇష్టమొచ్చినట్లు తిట్టారంటూ బాధ పడింది. కొందరైతే వేశ్య అంటూ కామెంట్స్ పెట్టారంటూ భావోద్వేగానికి లోనైంది. అయితే బస్తర్ సినిమా ఊహించినంత కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది.

అదా శర్మ ఈ మధ్య కాంట్రవర్సీ సినిమాలు ఒప్పుకుంటోందో.. ఆమె ఒప్పుకున్న సినిమాలు కాంట్రవర్సీ అవుతున్నాయో ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. గతంలో చేసిన ది కేరళ స్టోరీస్ కూడా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఈ బస్తర్ గురించి కూడా అలాంటి వ్యతిరేకతే వచ్చింది. ఇంక అదా శర్మ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తనకి నచ్చిన, తాను మెచ్చిన కథలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ కథలపై ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. తర్వాతి సినిమా ది గేమ్ ఆఫ్ గిర్గిత్ లో కూడా పోలీస్ పాత్ర చేస్తోంది. మరి.. అదా శర్మని దారుణంగా ట్రోలింగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş