Arjun Suravaram
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరి రేంజ్ కి తగట్టు వాళ్లు పెద్ద ఎత్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పెళ్లిళ్లలో కొత్తకొత్త టెక్నాలజీలని ఎక్కువగా వాడేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లిలో వింత ఘటన చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరి రేంజ్ కి తగట్టు వాళ్లు పెద్ద ఎత్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పెళ్లిళ్లలో కొత్తకొత్త టెక్నాలజీలని ఎక్కువగా వాడేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లిలో వింత ఘటన చోటుచేసుకుంది.
Arjun Suravaram
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతి మధురమైన వేడుక. అందుకే ఈ వేడుకను లైఫ్ లో గుర్తుండిపోయేలే చేసుకోవాలని చాలా మంది యువతీయువకులు కోరుకుంటారు. అలానే పూర్వం చాలా సాధారణంగా వివాహాలు జరిగేవి. అయితే కాలం మార్పుతో పాటు మనుషుల్లో ఆలోచన ధోరణి మారింది. దీంతో పెళ్లిన వెరైటీగా చేసుకోవాలని భావిస్తుంటారు. అందరి కంటే విభిన్నంగా చేసుకోవాలనే క్రమంలో కొందరు నూతన వధువరులకు ఊహించని షాక్ లు తగులుతుంటాయి. అలానే ఓ పెళ్లి మండపంలో వరుడికి గట్టి షాక్ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
నేటికాలంలో పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి ఆర్థిక స్థోమతకు తగినట్లు వాళ్లు పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. పెళ్లి విషయంలో ఖర్చుకు వెనుకాడటం లేదు. ట్రెండ్ కు తగినట్లు తమ పెళ్లిని జరుపుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పెళ్లిళ్లలో వధూవరులు మార్చుకునే దండలకు కూడా డ్రోన్ ను వినియోగిస్తున్నారు. అయితే అలా వినియోగించిన ఓ డ్రోన్ వరుడికి షాకిచ్చింది. తాజాగా ఆ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక వీడియోను చూసినట్లు అయితే.. పెళ్లి మండపంపైకి ఓ డ్రోన్ వచ్చింది. దాని ద్వారా వరుడికి పూల దండను అందించే ప్రయత్నం చేస్తారు ఈవెంట్ నిర్వహాకలు. నూతన దంపతలు వేరు వేరుగా ఉన్న స్టేజీలు దగ్గరగా వస్తున్నాయి. ఇదే సమయంలో వారి మధ్యకి ఓ డ్రోన్ పూల దండతో వస్తుంది. దాంతో వరుడు కాస్త డ్రోన్ నుండి వేలాడుతున్న పూలమాలను తీయడానికి ప్రయత్నించడం చేస్తాడు. ఈ క్రమంలోనే ఓ చిన్న ప్రమాదం జరిగింది. ఆ వరుడు డ్రోన్ నుండి దండను తీయడానికి పూల దండను పట్టుకోగా, డ్రోన్ రెక్క వేదికను ఢీకొని క్రాష్ అయినట్లు వీడియోలో కనపడుతుంది. అలా కూలిపోయిన డ్రోన్ వరుడికి అతి దగ్గరగా పడింది.
అదృష్టం కొద్ది అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. ఎవరైనా ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ చిన్న పొరపాటు జరిగి ఉంటే, నూతన దంపతులకు స్టేజ్ పైనే గాయాలు అయ్యేవని కొందరంటే.. చిన్నతనంలో రిమోట్ కార్లని కూడా సరిగ్గా నడపని వారు, ఇప్పుడు డ్రోన్ లను చేత్తో పెట్టుకుని తిరుగుతున్నారని మరొకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈవీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
आजकल शादी बियाह में यह सब नौटंकी एक अलग ही लेवल पर चल रहा हैं 😱🫡 pic.twitter.com/z9nK0RAe2O
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) March 13, 2024