iDreamPost
android-app
ios-app

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్.. కానీ ఒక కండీషన్!

  • Author singhj Published - 12:08 PM, Sun - 6 August 23
  • Author singhj Published - 12:08 PM, Sun - 6 August 23
రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్.. కానీ ఒక కండీషన్!

కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ గురించి తెలిసిందే. దేశ రాజకీయాల్లో ఆయన ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హస్తం పార్టీ అధికారం కోల్పోయి దాదాపు దశాబ్ద కాలం కావొస్తోంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్​ రెండు, మూడో స్థానానికి పడిపోయింది. ప్రాంతీయ పార్టీలు పవర్​లోకి వస్తున్నాయి. బీజేపీ దేశమంతటా వ్యాపించాలనే అజెండాతో దూసుకెళ్తోంది. ఈ తరుణంలో బలహీనపడిన కాంగ్రెస్​ను అంతా తానై ముందుకు నడిపిస్తున్నారు రాహుల్. యువ నాయకులను ప్రోత్సహిస్తూ, సీనియర్లను కలుపుకుపోతున్నారు. భారత్ జోడో యాత్రతో కార్యకర్తల్లో ఆయన ఫుల్ జోష్ నింపారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి రాహుల్, ఆయన చేసిన యాత్ర ఒక కారణంగా చెప్పొచ్చు.

అలాంటి రాహుల్ గాంధీ ఇటీవల ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోడీని ఇంటి పేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్​పై వేటు పడింది. నేరపూరిత పరువు నష్టం కేసులో దోషిగా తేలినందుకు రాహుల్​కు అనర్హత తప్పలేదు. అయితే ఈ కేసులో రీసెంట్​గా రాహుల్​కు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. అయినా ఆయన ఎంపీ సభ్యత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించలేదు. కాగా, బాలీవుడ్​ హీరోయిన్​ షెర్లిన్ చోప్రా గురించి సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. బోల్డ్ ఫొటోలు, కామెంట్స్​తో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్​కు ఊరట లభించడంపై ఆమె స్పందించారు.

ఈ కేసులో రాహుల్​ గాంధీకి రిలీఫ్ దక్కడం సంతోషంగా ఉందని షెర్లిన్ చోప్రా అన్నారు. ఈ టైమ్​లో ఆమెను ఒక జర్నలిస్టు సంచలన ప్రశ్న అడిగారు. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. దీనికి మరో మాట లేకుండా ‘హా, వివాహం చేసుకుంటా’ అని జవాబిచ్చారు షెర్లిన్. రాహుల్​ను మ్యారేజ్ చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారామె. రాహుల్ గాంధీని ఎందుకు మ్యారేజ్ చేసుకోకూడదంటూ జర్నలిస్టును ఎదురు ప్రశ్నించారామె. అయితే పెళ్లికి ఒక కండీషన్ అని చెప్పారు. రాహుల్​ను వివాహమాడాక తన ఇంటి పేరును మాత్రం మార్చుకోనని షెర్లిన్ స్పష్టం చేశారు. పెళ్లి తర్వాత కూడా తన సర్​నేమ్ చోప్రాగానే ఉంటుందని పేర్కొన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom